– Maduri Mattaiah
Nani about saipallavi | పక్కింటి కుర్రాడిలా కనిపించే సహజ నటుడు నాని. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా నేటి యువ కథానాయకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కొత్తదనం కోరుకునే చిత్రాలను ప్రేక్షకులకు అందించడంలో ముందుడే నాని ఈ జాబితాలో నటిస్తున్న వైవిధ్య చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ నెల 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా నానితో నమస్తే తెలంగాణ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది.
చాలా కాలం తరువాత మీ చిత్రం థియేటర్లో విడుదల కాబోతుంది? దీని పట్ల మీ స్పందన?
నేను మామూలుగానే థియేటర్లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమాను చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగరాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.శ్యామ్‌సింగరాయ్ ఓ పీరియాడికల్ ఫిలింలా కనిపిస్తుంది? ఈ చిత్రాన్ని ఎంచుకోవడానికి కారణమేంటి?కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. పీరియడ్ సినిమా అన్ని రకాలుగా రిస్క్ ఉంటుంది. శ్యామ్ సింగరాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు దొరికారు. ఇలాంటి కథకు మంచి టెక్నీషియన్స్ కూడా ఉండాలి. అలా అంతా కలిసి వచ్చినప్పుడు తెరపై ఆ ఫీల్‌ను తీసుకుని రాగలం. ఏవో సెట్లు వేశాం కాబట్టి పీరియడ్ సినిమా చూసినట్టుగా అనిపించదు. మీరే ఆ కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.
Naniకమల్‌హాసన్ నాయకుడు చిత్రానికి ఈ చిత్రానికి కొన్ని పోలికలు ఉన్నాయని అంటున్నారు?
కమల్‌హాసన్ నాయకుడు సినిమాకు, ఈ సినిమాకు సంబంధం ఉండదు. కానీ కమల్ గారి అభిమానిని అవ్వడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథపరంగా ఎక్కడా పోలిక ఉండదు. శ్యామ్ సింగరాయ్ కోసం ప్రత్యేకంగా వెయిట్ పెరగడం వంటివి ఏం చేయలేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది. నడిచే విధానం, మాట్లాడే తీరును బట్టి ఆ తేడాను మనం చూపించొచ్చు.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది?జెర్సీ డైరెక్టర్ గౌతమ్‌లోని క్వాలిటీస్..శ్యామ్ సింగరాయ్ దర్శకుడు రాహుల్‌లో చూశాను. చిన్న చిన్న వాటికి చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ వయసులో ఆ మెచ్యూరిటీ అరుదుగా ఉంటుంది. చాలా సెటిల్డ్‌గా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాహుల్‌ను అలా చూసి షాక్ అయ్యాను. అంతలా ఎప్పుడూ మాట్లాడలేదు. సెటిల్డ్‌గా ఉండే వారంతా కూడా వారి ఎనర్జీని అలా దాచుకుంటారేమో. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంటుంది. ప్రతీది డీటైల్డ్‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. తనకు లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే ఇంకెంత డీటైల్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.
Nani in shyam singharoyసినిమాలో శ్యామ్ సింగరాయ్ లక్ష్యం ఏమిటి?
శ్యామ్ సింగ రాయ్ పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై కమ్యూనిస్ట్ అయిన శ్యామ్ ప్రేమలో పడితే.. అతను ఎలా మారుతాడు అనేది సినిమా. శ్యామ్ సింగరాయ్ అనేది ఎపిక్ లవ్ స్టోరీ. ఇది పూర్తిగా కల్పితం.సినిమా ప్రచారం కూడా భారీగానే ప్లాన్ చేశారు?ఇప్పుడు వరుసగా సినిమాలున్నాయి. ఈ సమయంలో కాస్త గట్టిగానే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంత ప్రమోట్ చేసినా మొదటి ఆట వరకే. ఆ తరువాత సినిమానే చూసుకుంటుంది. అయినా మాకు ఈ సినిమా ఎలా వచ్చిందో తెలుసు. ఎంతో నమ్మకంగా ఉన్నాం.మీ గత చిత్రాలు ఓటీటీలో విడుదలైన సరైన ఆదరణ పొందలేకపోయాయి? వాటిని విశ్లేషించుకున్నారా?ఎంసీఏ సినిమాకు టక్ జగదీష్ సినిమాకంటే తక్కువగా రివ్యూలు వచ్చాయి. కానీ నా కెరీర్లో ఎంసీఏ బ్లాక్ బస్టర్ హిట్. అయితే వీ, టక్ జగదీష్ సినిమాల పట్ల నిర్మాతలు, అమెజాన్ కూడా హ్యాపీగా ఉంది. హయ్యస్ట్ వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయని అన్నారు. కానీ ఇక్కడ మీకు ఎంసీఏకు చూపించినట్టుగా లెక్కలు చూపెట్టలేకపోతున్నాం. ప్రేక్షకులంతా సినిమాలు చూడాలని అనుకున్నామంతే.
Naniఇక నుంచి నాని సినిమాలు థియేటర్లో వస్తాయని ఆశించవచ్చా?
నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. నిర్మాతలు హ్యాపీగా ఉండాలి. సినిమా కోసం పని చేసినవారంతా సంతోషంగా ఉండాలి. రెగ్యులర్‌గా పని చేస్తుండాలి. ఆ పనిని ఆపకూడదు. అది ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు.ఈ సినిమా బడ్జెట్ కూడా మీ కెరీర్లో అత్యధికం అంటున్నారు?నా కెరీర్లో ఏ సినిమా చేసినా.. అప్పటి వరకు అదే హయ్యస్ట్ బడ్జెట్. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్. ఆ తరువాత దసరా. ఇలా ప్రతి ఒక్కటి ఆ సమయానికి హయ్యస్ట్ బడ్జెట్ అవుతుంది. గ్రోత్ అలా పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకు ఇప్పుడు మార్నింగ్ షోకు నేను అనుకున్న టాక్ వస్తే ఎవ్వరూ ఆపలేరు.ఈ చిత్రంలో స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు పాట రాశారు? అది మీకు ఎలాంటి అనుభూతనిచ్చింది?సిరివెన్నెల గారు మాకు పాట రాయడం ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఇది చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల గారు అన్నట్టుగా రాహుల్ నాతో చెప్పాడు. కానీ అలా అవుతుందని మేం అనుకోలేదు. ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరున్నారు. ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన శ్యామ్ సింగరాయ్కు రాయడం అనేది వరం. ఆయన్ను సెలెబ్రేట్ చేసుకునే బాధ్యత మా మీద పెట్టినట్టు అయింది. ఇది మాకు ఎమోషనల్ ఎలిమెంట్ అయింది. ఆయనకు నివాళిగా ఈ సినిమా మొదలవుతుంది. ఆయన రాసేందుకు సరిపడా సినిమాను ఇచ్చామన్న సంతృప్తి మాకు వచ్చింది.శ్యామ్ సింగరాయ్ కథకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా?శ్యామ్ సింగరాయ్ కోసం ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోలేదు. రిఫరెన్స్‌లు తీసుకోలేదు. శ్యామ్ రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాను. చిన్నప్పటి నుంచి మన జీవితంలోనే ఎన్నో రిఫరెన్స్లుంటాయి.
Nani about saipallavi సాయిపల్లవితో ఎంసీఏ తరువాత మళ్లీ కలిసి నటిస్తున్నారు?
హిట్ పెయిర్ అనే సెంటిమెంట్‌తోనే సాయిపల్లవిని తీసుకున్నారా?ఎంసీఏకి ఇప్పటికీ సాయి పల్లవి అలానే ఉంటుంది. అందులో ఓ నాలుగు సీన్లుంటాయి. మా సీన్లు అందరికీ కనెక్ట్ అయ్యాయి. పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. ఇంటెన్సిటీ, పర్ఫామెన్స్ వంటివి నమ్మేవాళ్లం. ఇంకోసారి కలిసి సినిమా చేస్తే ఈ ప్రపంచానికి దూరంగా ఉండే పాత్రలు రావాలని అనుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని అనుకున్నాం. అలా శ్యామ్ సింగరాయ్‌తో రాబోతోన్నాం. ఇకపై మా బాధ్యత మరింత పెరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి భుజాల మీద బరువు ఎక్కువగా ఉండబోతోంది.దసరా సినిమా ఎలా ఉంటుంది?దసరా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. ప్రస్తుతం నా చేతిలో అంటే సుందరానికీ, దసరా సినిమాలున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు టచ్ చేయని కలర్, జానర్లో దసరా ఉంటుంది. తెలంగాణ వాళ్లు కూడా పలకలేని స్పష్టమైన యాసలో ఉంటుంది. మరీ పీరియడ్ కాదు కానీ.. ఓ పదిహేనేళ్లు వెనక్కి వెళ్తాం. అంటే సుందరానికీ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఏప్రిల్ వచ్చే అవకాశం ఉంది.