Shyam Singha Roy Making video | క్యూరియాసిటీ పెంచుతున్న ‘శ్యామ్ సింగరాయ్’ మేకింగ్ వీడియో
టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan), నాని కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). డిసెంబర్ 24న శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుండగా..మేకర్స్ నాని అభిమానుల్లో జోష్ నింపేందుకు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

టాలీవుడ్ (Tollywood) న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan) దర్శకత్వం వహిస్తున్నాడు. సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఫిలిం డైరెక్టర్ వాసుగా, శ్యామ్ సింగరాయ్‌గా నాని రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలిసిపోయింది.
డిసెంబర్ 24న శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తాజాగా మేకర్స్ నాని అభిమానుల్లో జోష్ నింపేందుకు విడుదలకు ఒక రోజు ముందు మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఎక్కువ భాగం కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో తీయగా..మేకింగ్ వీడియో చూస్తే సినిమా కోసం నాని, సాయిపల్లవి ఎంత కష్టపడ్డారో తెలిసిపోతుంది. 1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో సాగనున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
నాని సంప్రదాయ బెంగాలీ గెటప్‌లో ఇదివరకెన్నడూ కనిపించన విధంగా న్యూ లుక్‌తో అదరగొడుతున్నాడు. మరోవైపు సాయిపల్లవి దేవదాసి పాత్రలో కనిపించనున్నట్టు ట్రైలర్లో చెప్పాడు డైరెక్టర్. ఓ వైపు వాసు, కృతిశెట్టి, మరోవైపు శ్యామ్ సింగరాయ్, సాయిపల్లవి లవ్ ట్రాక్స్ సినిమాలో ఉండబోతున్నాయి.
నిహారిక ఎంటర్టైన్ మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

