Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?

Shyam singharoy in OTT | చాలా రోజుల తర్వాత నాని సినిమా థియేటర్లో విడుదలైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైన శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. కమర్షియల్గానూ మంచి కలెక్షన్లను రాబడుతోంది. పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో నాని రెండు విభిన్న లుక్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషల్‌మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. త్వరలోనే ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని అదరగొట్టాడు. ఆ పాత్రలో నాని తనలో కొత్త కోణాన్ని చూపించాడని అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమాకు సాయిపల్లవి హైలెట్ అని చెప్పొచ్చు. మరోసారి ఆమె తనలోని టాలెంట్‌ను బయటపెట్టింది. కృతిశెట్టి కూడా అందంగా కనిపించింది. మలయాళ భామ మడోనా సెబాస్టియన్ సినిమాలో మరో కీలక పాత్రలో నటించింది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమా చాలా రోజుల గ్యాప్ తర్వాత నానికి కమర్షియల్ హిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ శ్యామ్ సింగరాయ్ సినిమా రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఈ వార్త ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Pallavi | హిందీ సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..డైరెక్టర్లు రెడీనా..?
బుర్ఖాలో థియేటర్‌కి వచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

