Kriti Shetty | కంఫర్ట్‌ను బట్టే ఆ సన్నివేశాలు బాగా వస్తాయి.. లిప్‌లాక్ సీన్లపై కృతిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Kriti Shetty | అందం, అమాయకత్వం, కొంటెతనం కలబోసిన పల్లెటూరి యువతి బేబమ్మగా ‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు చేరువైంది కృతి శెట్టి. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా కృతి శెట్టి పంచుకున్న ముచ్చట్లు…

తొలి సినిమాకే పూర్తి భిన్నమైన పాత్రను ఎంచుకున్నారు. కారణం?
‘ఉప్పెన’లోని బేబమ్మకు, ‘శ్యామ్‌సింగరాయ్’లోని కీర్తి పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. బేబమ్మ పాత్ర పల్లెటూరి సంస్కృతీ సంప్రదాయాలతో ముడిపడిసాగుతుంది. ‘శ్యామ్‌సింగరాయ్’లో హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఆధునిక యువతిగా నటించాను. ఈ పాత్ర కోసం నవతరం అమ్మాయిల మనస్తత్వాలు, హావభావాలు ఎలా ఉంటాయో పరిశోధించాను. కొన్ని ఇంగ్లిష్ సినిమాల్నీ చూశాను. ఆ స్ఫూర్తితో పాత్రలో ఒదిగిపోయేందుకు ప్రయత్నించాను.
కీర్తి పాత్రకు న్యాయం చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
తెరపై నా పాత్రను పండించడానికి దర్శకుడి సూచనలతో పాటు నేనూ సొంతంగా పరిశోధన చేస్తుంటా. పాత్ర తీరుతెన్నులు, వస్త్రధారణ, ఆహారం.. ఏవంటే ఇష్టమో పేపర్‌పై రాసుకుంటాను. ఈ సినిమాలో చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమై, తండ్రి సంరక్షణలో పెరిగే అమ్మాయిగా కనిపిస్తా. ఆ లక్షణాలకు అనుగుణంగానే టామ్‌బాయ్‌గా నా పాత్రను డిజైన్ చేశారు.
సినిమాలో మీకు చాలెంజింగ్‌గా అనిపించిన ఘట్టాలు?
సిగరెట్ తాగే సన్నివేశం సవాల్‌గా అనిపించింది. నేను స్మోకింగ్ ఇష్టపడను. దర్శకుడు చెప్పగానే భయపడ్డా. ఆ సీన్ తొలగించమని కూడా అడిగా. అలాంటి సన్నివేశాల్లో నటించినప్పుడే ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్ మధ్య వేరియేషన్ చూపించగలుగుతావని దర్శకుడు రాహుల్ సూచించారు. నా కోసం నికోటిన్ లేని హెర్బల్ సిగరెట్ తెప్పించారు. స్మోకింగ్ సీన్ ఫొటో షూట్ సమయంలో సిగరెట్ పట్టుకోగానే చేతులు వణికాయి. సిగరెట్ ఎలా పట్టుకోవాలో, ఎలా తాగాలో మూడు రోజులు నేర్చుకున్నా.
నానితో తొలిసారి కలిసి నటించడం ఎలాంటి అనుభూతిని పంచింది?
కథానాయికగా ఒక సినిమా అనుభవమే ఉంది నాకు. తొలిరోజు సెట్స్‌లో అడుగుపెట్టే ముందు చాలా భయపడ్డా. నాని నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో, అనుభవలేమితో నేను చేసే తప్పుల్ని చూసి ఏమంటారో అనుకున్నా. కానీ ఆయన అవేవీ పట్టించుకోలేదు. నా భయాల్ని పోగొట్టి ధైర్యాన్నిచ్చారు. తన ఒక్కడి నటనపైనే దృష్టిపెట్టకుండా సెట్స్‌లో అందరినీ గమనిస్తూ ఉంటారాయన. ఇతరుల తప్పుల్ని సున్నితంగా సరిదిద్దుతుంటారు.
ఈ సినిమాకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
కీర్తి పాత్రలో బాగా నటించానని నాన్న మెచ్చుకున్నారు. షూటింగ్ సమయంలో ఏ రోజూ నాన్న సెట్స్‌కు రాలేదు. నా లుక్, పాత్ర గురించి ఆయనకు అవగాహన లేదు. థియేటర్లో సినిమా చూశాక మాత్రం సంతోషంగా ఫీలయ్యారు. రియల్ లైఫ్‌కి భిన్నంగా కొత్తగా కనిపించానని మెచ్చుకున్నారు.

సినిమాల ఎంపికలో ఏ అంశాలకు ప్రాధాన్యమిస్తారు?
‘ఉప్పెన’ తర్వాత పల్లెటూరి అమ్మాయి పాత్ర కోసం చాలా మంది దర్శకులు నన్ను సంప్రదించారు. ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారని అనిపించింది. నటన పరంగా నాలోని భిన్నత్వాన్ని చూపే అవకాశం ఉంటుందనే ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రాన్ని అంగీకరించా. రెండు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. వారి అభిమానాన్ని నిలబెట్టుకోవాలంటే నిత్యం కష్టపడాల్సిందేనని నమ్ముతా.
తదుపరి సినిమాల విశేషాలు?
నాగార్జున, నాగ చైతన్యతో నటిస్తున్న ‘బంగార్రాజు’ షూటింగ్ పూర్తయింది. రామ్-లింగుస్వామి కలయికలో వస్తున్న సినిమాతో తమిళంలో అరంగేట్రం చేయబోతున్నా. విరించి వర్మ దర్శకత్వంలో ఓ మహిళా ప్రధాన చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. సుధీర్‌బాబుతో మరో సినిమా చేస్తున్నా.
లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బంది పడ్డారా? ఆ తరహా సన్నివేశాలపై మీ అభిప్రాయం?
బోల్డ్, లిప్‌లాక్ సన్నివేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తారు. వాటిలో నటిస్తే కథానాయికల కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందనే అపోహ ఉంది. లిప్‌లాక్ నటనలో భాగమేనని నమ్ముతా. యాక్షన్ సీన్స్‌లానే బోల్డ్ సీన్స్‌లోనూ నటిస్తాను. ప్రత్యేకంగా చూడను. నాయకా
నాయికల మధ్య కంఫర్ట్‌ను బట్టే లిప్‌లాక్ సీన్స్ బాగా వస్తాయి. కథలో లిప్‌లాక్ సన్నివేశాలకు ప్రాధాన్యం లేకపోతే నేను నటించను.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Krithi Shetty : తన కోరికను బయటపెట్టిన కృతి శెట్టి
ఉప్పెన హీరోయిన్ డూప్.. వైరల్ అవుతున్న ఫొటోస్
కృతి శెట్టి : బేబమ్మ.. ఇది మరీ టూ మచ్
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

