Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..

Shyam singha roy Bollywood remake | నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ముందు నుంచి చెప్పినట్లే క్రిస్మస్ నాని సొంతమైంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా 20 కోట్ల షేర్ వసూలు చేసి.. మరో రెండు కోట్ల దూరంలో మాత్రమే నిలిచింది. నాని గత సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో శ్యామ్ సింగరాయ్ బిజినెస్ తక్కువగా జరిగింది. ఇప్పుడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఏపీలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఉన్న థియేటర్స్‌లో అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఈ సినిమా. ఇప్పటి వరకు శ్యామ్ సింగరాయ్ సినిమా రూ.19.45 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ. 22.50 కోట్ల బిజినెస్ చేసింది శ్యామ్ సింగరాయ్. ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ వైపు వెళ్తుంది. దీని గురించి నాని కూడా క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే నాని హీరోగా నటించిన పలు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అందులో ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న జెర్సీ కూడా ఉంది. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా బాలీవుడ్ వైపు తీసుకెళుతున్నట్టు చెప్పాడు ఈయన. అయితే అక్కడ ఎవరు నటిస్తారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. జెర్సీ మాదిరే ఈ సినిమాను కూడా దిల్ రాజు రీమేక్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. నాని నటించిన జెర్సీ సినిమాను హిందీలో అల్లు అరవింద్‌తో కలిసి నిర్మించాడు దిల్ రాజు. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా హిందీలో దిల్ రాజు రీమేక్ చేసే అవకాశం లేకపోలేదు. శ్యామ్ సింగరాయ్ సినిమాను నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇక్కడ నాలుగు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. రెండేళ్లుగా సరైన సినిమాలు లేక వరుస పరాజయాలు అందుకుంటున్న నాని.. థియేటర్స్ లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మంచి విజయం అందుకున్నాడు. నాని నటనలో కొత్త కోణాన్ని శ్యామ్ సింగరాయ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది అంటూ చిత్ర యూనిట్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
R Narayana Murthy | నాని ‘తెలుగు అమీర్‌ఖాన్’..ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ వైరల్
పవన్ కళ్యాణ్‌తో శ్యామ్ సింగరాయ్ 2 తీస్తా.. రాహుల్ సాంకృత్యన్ సెన్సేషన్ కామెంట్స్
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

