R Narayana Murthy | నాని ‘తెలుగు అమీర్‌ఖాన్’..ఆర్ నారాయణమూర్తి కామెంట్స్ వైరల్
సినిమా వినోదం కోసమే కాకుండా సామాజిక కోణంలో ఉండాలని ఆశిస్తుంటారు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి (R Narayana Murthy). ఆర్ నారాయణమూర్తి స్టార్ హీరో నాని (Nani)గురించి మాట్లాడిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా కోసం ఎన్ని కష్టాలైనా పడే యాక్టర్లు చాలా కొద్ది మందే ఉంటారు. అలాంటి వారి జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంటారు సీనియర్ యాక్టర్ ఆర్ నారాయణమూర్తి (R Narayana Murthy). ఈ పీపుల్స్ స్టార్ సినిమా వినోదం కోసమే కాకుండా సామాజిక కోణంలో ఉండాలని ఆశిస్తుంటారు. యువ హీరోల సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ వారిలో మంచి ఉత్సాహాన్ని నింపుతుంటారు. తాజాగా ఆర్ నారాయణమూర్తి స్టార్ హీరో నాని (Nani)గురించి మాట్లాడిన మాటలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
శ్యామ్ సింగ రాయ్ సక్సెస్ మీట్ (Shyam Singha Roy success meet )లో ఆయన మాట్లాడుతూ..నానిని తెలుగు అమీర్‌ఖాన్ (Telugu Aamir Khan)గా అభివర్ణించారు. నాని అద్బుతమైన నటుడు. అతడు వ్యక్తిగతంగా మామూలుగా కనిపిస్తాడు..కానీ ప్రభావం మాత్రం చాలా చూపిస్తాడు. కాళిమాత దగ్గర ఫైటింగ్ చేస్తున్నపుడు, నేను చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయా. నాని యాక్షన్ హీరో, క్లైమాక్స్ లో ఎమోషనల్ హీరో కనిపిస్తాడు. అతడి యాక్టింగ్‌కు సెల్యూట్. శ్యామ్ సింగ రాయ్ గెటప్ చూసి స్టన్ అయిపోయా. ఆ గెటప్‌లోకి నాని ఎలా మారాడో తెలిసి చాలా గర్వంగా అనిపించిందన్నారు.
నాని మరో ఎన్టీఆర్, శివాజీ గణేశన్, ఏఎన్ఆర్ అంటూ ఆకాశానికెత్తేశాడు. శ్యామ్ సింగ రాయ్ ఇండస్ట్రీకి మంచి ఊరటనిచ్చిందని చెప్పుకొచ్చారు ఆర్ నారాయణమూర్తి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

