టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న తాజా సినిమా శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). టాక్సీ వాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. ఇవాళ వరంగల్‌లో శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నాని సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నానన్నాడు నాని. రాబోయే రోజుల్లో తెలుగులో వరుసగా రిలీజ్లు ఉన్నాయి..కానీ నా చేతిలో మాత్రం సూపర్ హిట్ ఉందని తెలిసి.. ఆ సినిమాలకు అస్సలు భయపడనని చెప్పాడు నాని. క్రిస్మస్ మాది.. నా సినిమా ఈ సీజన్ లో పెద్ద హిట్ అవుతుందని అన్నాడు. రాహుల్ సంకీర్త్యన్ మొదటి సినిమా నేను చూడలేదు, కానీ అతడు తనలో ఉన్న సెన్సిబిలిటీస్ కోసం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్లలో ఒకవుతాడని ఖచ్చితంగా చెప్పగలను. రీ రికార్డింగ్ పనుల వల్ల డైరెక్టర్ రాహుల్ ఈవెంట్ కు రాలేకపోయాడని చెప్పాడు నాని.
ఎడిటర్ నవీన్ నూలికి జెర్సీ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. శ్యామ్ సింగ రాయ్ సంక్లిష్టమైన సినిమా. ఈ సినిమాతో నవీన్ నూలికి మరో అవార్డు వస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ఈవెంట్ గోల్డెన్ కలర్ పంజాబీ డ్రెస్‌లో కృతిశెట్టి మెరిసిపోగా..సాయిపల్లవి గులాబీ రంగు చీర,స్లీవ్ లెస్ బ్లౌజ్లో తళుక్కుమంది.
The Voice Of Ravanna | రానాకు బర్త్ డే విషెస్..ఎమోషనల్‌గా ‘ది వాయిస్ ఆఫ్ రవన్న’ వీడియో
Akshay Awe of Dhanush Acting | ధనుష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన స్టార్ హీరో
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ