కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ధనుష్ (Dhanush)నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి అట్రాంగి రే (Atrangi Re). హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)తోపాటు సారా అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రషెస్కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో ధనుష్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయినట్టు చెప్పాడు.
సినిమాలోని చాలా సన్నివేశాల్లో ధనుష్ ప్రాణం పెట్టి నటించాడని, సినిమాకు ధనుష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాడని చెప్పుకొచ్చాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ధనుష్‌కు తమిళంతోపాటు ఇతర భాషల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంత గ్యాప్ తర్వాత ధనుష్ నటిస్తోన్న ఈ హిందీ చిత్రం ఏ స్థాయిలో హిట్ కొడుతుదో చూడాలి.
టీ సిరీస్ , కలర్ యెల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆప్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అట్రాంగి రే ట్రైలర్ పై ఓ లుక్కేయండి మరీ..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ