టాలీవుడ్ (Tollywood) న్యాచురల్ స్టార్ నాని (Nani) నటించిన తాజా ప్రాజెక్టు శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy). టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrtiyan) డైరెక్ట్ చేశాడు. నాని ఇప్పటివరకు చేసిన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి శ్యామ్ సింగ రాయ్లా ఛాలెంజింగ్ రోల్లో కనిపించాడు. ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోండగా..కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయనేది త్వరలో తెలియనుంది. కొత్తదనంతో కూడిన స్టోరీలను చేసేందుకు ఎప్పుడు రెడీ అంటున్నాడు నాని.
ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు. జెర్సీ తర్వాత, శ్యామ్ సింగ రాయ్‌పై అద్బుతమైన ప్రేమ కురిపించారు. సినిమాకు మంచి స్పందన వస్తుంది. నటీనటులు ఛాలెంజింగ్‌గా అనిపించిన కథలు చేయాలి. రిస్క్ లేకపోతే ఎలాంటి ఎక్జయిట్మెంట్ కానీ, ఫీల్ కానీ ఉండదు. శ్యామ్ సింగ రాయ్ విషయంలో ఆ బాధ లేదు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్ లాంటి కొన్ని కథలు మాత్రమే ప్రేక్షకులకు అద్బుతంగా నచ్చుతాయి.
అంటే సుందరానికి, దసరా మూవీ స్టోరీలను విన్న వెంటనే ఒకే చేశా. నాలో కొత్త నటుడిని చూస్తారు. అదృష్టవశాత్తు మంచి కథలు వస్తున్నాయి. గత ఐదేళ్లలో ఇలాంటి కవితాత్మక చిత్రం రాలేదని చెప్పుకొచ్చాడు నాని.