దక్షిణాది సినీ పరిశ్రమ (South film industry)లో ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరు సాయిపల్లవి (Sai Pallavi). నో మేకప్ పాలసీని పాటించే హీరోయిన్లలో సాయిపల్లవి టాప్లో ఉంటుంది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy)తో ప్రేక్షకులను పలుకరించింది. ఈ చిత్రంలో దేవదాసి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. తెలుగు, తమిళ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న ఈ భామ అందరిలాగే హిందీలో కూడా సినిమాలు చేయబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మొత్తానికి డైరెక్ట్ బాలీవుడ్ సినిమా (Bollywood)పై సాయిపల్లవి నుంచి దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్టే. రీసెంట్ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ..బాలీవుడ్ సినిమా చేయడానికి తాను సిద్దమేనని చెప్పింది. అయితే కథ చాలా ముఖ్యమని చెప్పింది. నానితో మరోసారి బాలీవుడ్ డెబ్యూ చేయడం బాగుంది. నాకు సరిపడే కథ, పర్ఫెక్ట్ పాత్ర ఉంటే కానీ ఉత్తరాదిన ఎంట్రీ ఇవ్వలేను..అంటూ చెప్పుకొచ్చింది.
మొత్తానికి సాయిపల్లవి హిందీ సినిమా చేసేందుకు రెడీ అని చెప్పడంతో ఎవరో ఒక డైరెక్టర్ ఖచ్చితంగా ఆమెకు షూట్ అయ్యే కథను సిద్దం చేసే పనిలో పడి ఉంటాడని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.