Sai pallavi in Theater | తాము నటించిన సినిమాలకు రెస్పాన్స్ ఎలా వస్తుంది.. ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని తెలుసుకోవడానికి నటీనటులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వాళ్లు థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులతో పాటు సినిమాలు చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ బురఖా వేసుకొని థియేటర్ కు వచ్చి తన సినిమా చూసింది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ బురఖా ధరించి సినిమా చూసిన హీరోయిన్ ఎవరో కాదు.. సాయి పల్లవి.
నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయి సినిమాలో రోజీ పాత్రలో నటించింది సాయి పల్లవి. ఈ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ సినిమా 4 రోజుల్లో 20 కోట్లు వసూలు చేసింది. తాజాగా ఈ సినిమా రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూడటానికి బురఖా వేసుకుని దర్శకుడు రాహుల్ తో పాటు హైదరాబాద్ మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ కు వచ్చింది. ప్రేక్షకులు తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు బుర్ఖాలో వెళ్లింది సాయి పల్లవి. ఆమెతో పాటు చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఈ ఫోటోలో ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సాయి పల్లవి సర్ప్రైజ్ విజిట్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అయితే కాసేపటికే ఆ వీడియోను తొలగించారు.
శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలు పోషించాడు నాని. ఈ చిత్రంలో కృతిశెట్టి మరో కథానాయిక. మడోన్నా సెబాస్టియన్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రధారులు. రెండేళ్ల తర్వాత థియేటర్లో విడుదలైన నాని సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi | హిందీ సినిమాకు సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్..డైరెక్టర్లు రెడీనా..?
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..