Saana kastam song from Acharya | చాలా రోజుల నుంచి చిరంజీవి ఆచార్య సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా ఫిబ్రవరి 4కి వస్తుందని తెలిసిన తర్వాత అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు న్యూ ఇయర్ కానుకగా అనుకోని గిఫ్ట్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. ఆచార్య సినిమా నుంచి అదిరిపోయే మాస్ పోస్టర్ విడుదల చేశారు. అందులో చిరంజీవి వింటేజ్ లుక్ పిచ్చెక్కిస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని ఈ ఫోటోలో చూస్తుంటే 66 కాదు 36 లా కనిపిస్తున్నాడు అంటూ పండుగ చేసుకుంటున్నారు ఫాన్స్. జనవరి 3న ఆచార్య సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్లో పేర్కొన్నారు.
చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లాహే లాహే, నీలాంబరి పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాట విడుదల కానుంది. శానా కష్టం అంటూ సాగే ఈ పాటలో రెజీనా చిందులేసింది. కచ్చితంగా ఈ పాట కొత్త ఏడాది మెగా అభిమానులకు తారకమంత్రంగా మారిపోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు లాహే లాహే పాటలో చిరంజీవి ఒక్క స్టెప్ వేస్తేనే మెగా ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇప్పుడు ఈ పాటలో అన్నయ్య అదిరిపోయే స్టెప్పులు వేసినట్లు తెలుస్తోంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడని ప్రచారం జరుగుతుంది. అభిమానులు కోరుకునే అదిరిపోయే డాన్స్ స్టెప్పులు ఈ పాటలో కనిపించబోతున్నాయి. పోస్టర్లోనే ఆ ఊపు కనిపిస్తోంది. రేపు పాట విడుదలైన తర్వాత యూట్యూబ్ షేక్ అయిపోవడం ఖాయం. జనవరి 3న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ఈ పాట విడుదల కానుంది. ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. రామ్ చరణ్ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఆచార్య సినిమాను నిర్మిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chiranjeevi Pan india | ‘ఆచార్య’ విషయంలో అసంతృప్తిగా చిరంజీవి..?
Chiranjeevi Acharya | ఆచార్య సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదా..?
Tollywood | 2022లో ఆ నలుగురు హీరోల ట్రిపుల్ బొనాంజా..
Chiranjeevi: మెగాస్టార్ ఆల్‌టైం రికార్డ్.. ఒకే నెలలో నాలుగు సినిమాల షూటింగ్స్‌తో బిజీ