Chiranjeevi Acharya | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్స్కు అద్భుతమైన స్పందన వచ్చింది. తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా ఆకాశంలో ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ కూడా ముందు నుంచి ఈ విషయంలోనే ఎక్కువగా కంగారు పడుతున్నాడు. అయితే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా అనుకున్నది అనుకున్నట్లు సినిమా చేయాలి అంటూ చిరంజీవి తనకు చెప్పాడని.. ఆ ధైర్యంతోనే పూర్తి చేశాను అంటున్నాడు దర్శకుడు కొరటాల.
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది అని మెగా అభిమానులతో పాటు అందరూ భావించారు. కానీ ఆచార్య ఇంకా అయిపోలేదు.. కొన్ని పనులు పెండింగ్ అలాగే ఉండిపోయాయని ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. కొన్ని సన్నివేశాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎక్కువగా మిగిలిపోయాయి అంటున్నాడు. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పాడు దర్శకుడు కొరటాల. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. దాంతో ఆచార్య కోసం అనుకున్న సమయం కేటాయించలేకపోతున్నాడు. మరోవైపు రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్‌తో పాటు శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇద్దరూ ఫ్రీ అయిన తర్వాత ఆచార్య పూర్తి చేయనున్నాడు కొరటాల శివ. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో 2022 ఫిబ్రవరి 4కు వాయిదా వేశారు. ఇంకా చాలా సమయం ఉండటంతో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తున్నాడు దర్శకుడు. ఆచార్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా కమిట్ అయ్యాడు. 2022 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Acharya OTT Partner | ఆచార్య ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా..?
Mega 154: బాబీ మూవీ సెట్ లో చిరంజీవి.. ఎమోషనల్ అయిన దర్శకుడు
Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం