కామారెడ్డి, మార్చి 11 : రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు అన్నదాతల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు, కార్యకర్తలు బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. రైతు భరోసా విడుదల చేయడంతో పాటు సరిపడా యూరియా సరఫరా చేయాలని, రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నేత చెలిమల భానుప్రసాద్, నేతలు రంజిత్‌వర్మ, శేఖర్, లష్కర్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, దేవరాజు, సతీశ్, రామ్మూర్తి పాల్గొన్నారు.
తాగునీరు ఇవ్వండి సారూ.. అంటూ కరీంనగ ర్లోని చింతకుంటవాసులు బుధవారం జిల్లాకేంద్రంలోని టీఆర్‌కేనగర్‌లో రోడ్డుపై బిందెలు, బకెట్లతో బైఠాయించారు. తమ ఏరియాకు వచ్చే పైప్‌లైన్ వారం క్రితం పగిలిపోయిందని, అప్పటి నుంచి నీళ్లు రావడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకుంటే మున్సిపాలిటీ ఎదుట ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. సమస్య ను పరిష్కరింపజేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.