టాలీవుడ్(Tollywood)స్టార్ హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రం ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రషెస్కు మంచి స్పందన వస్తోంది. వరల్డ్ వైడ్‌గా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది ఆచార్య. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. పోస్ట్ థ్రియాట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ పార్ట్నర్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( Amazon Prime Video) దక్కించుకున్నట్టు టాక్.
థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఆచార్య ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేయనున్నాడన్నమాట. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఆచార్య. సామాజిక ఇతివృత్తంతో కూడిన యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ హీరో చేతిలో ప్రస్తుతం వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న భోళా శంకర్, లూసిఫర్ రీమేక్‌గా వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రాలతోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
ఇది కూడా చూడండి
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్