బాలీవుడ్ (Bollywood) బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఎప్పుడూ ఏదో వివాదంతో సహవాసం చేస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌మీడియాలో తనదైన స్టైల్లో కామెంట్లు పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది కంగనా. సాగు చట్టాలను (Farm Laws) రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఓ వైపు ఆనందంతో సంబురాలు చేసుకుంటుంటే మరోవైపు కంగనా మాత్రం దీన్ని ఖలిస్థానీ ఉద్యమం అని, రైతులను ఉగ్రవాదులని పేర్కొంటూ..ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.
ఈ నేపథ్యంలో కంగనాపై సిక్కులు కేసు పెట్టారు. సుబుర్భన్ ఖన్ పోలీస్ స్టేషన్లో కంగనాపై కేసు నమోదయ్యింది. తాజాగా దీనిపై ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కంగనా పెట్టిన మరో పోస్ట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బ్యాక్ లెస్ బ్లాక్ డ్రెస్ విత్ స్లిట్ గెటప్‌లో ఉన్న కంగనా చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని బ్లాక్ చూపిస్తున్న స్టిల్ పోస్ట్ చేసింది. మరొక రోజు మరో ఎఫ్ఐఆర్. ఒకవేళ వాళ్లు నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..ఇంటి దగ్గర నా మూడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
సున్నితమైన రైతుల అంశంలో కంగనా చేసిన కామెంట్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తులకు తనదైన శైలిలో వ్యంగ్యంగా సమాధానమిచ్చింది కంగనా. మరి దీనిపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్