Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
బాలీవుడ్ (Bollywood)లో హాట్ టాపిక్ న్యూస్ ఏదైనా ఉన్నదంటే అది కత్రినాకైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal) పెళ్లి. నవంబర్ చివరలో జైపూర్ (Jaipur wedding )లో గ్రాండ్‌గా వెడ్డింగ్ సెర్మనీ జరుగనున్నట్టు న్యూస్ తెరపైకి వస్తున్నా..దీనిపై ఇప్పటివరకు కత్రినా, విక్కీకౌశల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

బాలీవుడ్ (Bollywood)లో హాట్ టాపిక్ న్యూస్ ఏదైనా ఉన్నదంటే అది కత్రినాకైఫ్ (Katrina Kaif) పెళ్లి. కొంతకాలంగా రిలేషన్ షిప్లో ఉన్న స్టార్ సెలబ్రిటీలు విక్కీ కౌశల్ (Vicky Kaushal) , కత్రినాకైఫ్ (Katrina Vicky Kaushal wedding)త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ చివరలో జైపూర్ (Jaipur wedding )లో గ్రాండ్‌గా వెడ్డింగ్ సెర్మనీ జరుగనున్నట్టు న్యూస్ తెరపైకి వస్తున్నా..దీనిపై ఇప్పటివరకు కత్రినా, విక్కీకౌశల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇపుడు మరో క్రేజీ అప్ డేట్ బీటౌన్‌లో హల్చల్ చేస్తుంది. జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు కోర్టు మ్యారేజ్ (court marriage) చేసుకోబోతున్నారన్న టాక్ హాట్ టాపిక్‌గా మారింది. సంప్రదాయ పెళ్లి వేడుకకు ముందు ముంబైలో కోర్టు వెడ్డింగ్ జరుపుకోనున్నారట. మరి తాజాగా వచ్చిన అప్డేట్పైనైనా ఈ స్టార్ సెలబ్రిటీలు ఏమైనా స్పందిస్తారోమో చూడాలి.
కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ రిలేషన్ షిప్ వ్యవహారం చాలా రోజులుగా మీడియాలో నానుతున్న విషయమే అయినా దీనిపై ఇద్దరి నుంచి ఎలాంటి కామెంట్స్ రాకపోవడంతో..అసలు ఈ అప్డేట్ ఎంతవరకు నిజం..అంటూ తలలు పట్టుకుంటున్నారు ఫాలోవర్లు, అభిమానులు. రానున్న రోజుల్లో కత్రినా-విక్కీ పెళ్లిపై ఏదైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందేమో చూడాలి మరి.
కోర్టు మ్యారేజ్ అంటే..
కోర్టు మ్యారేజ్ అనేది ‘ప్రత్యేక వివాహ చట్టం, 1954’ ద్వారా నిర్వహించబడేది. కోర్టు మ్యారేజ్ దేశవ్యాప్తంగా సాధారణమైన అంశం. ముందుగా జిల్లా వివాహ రిజిస్ట్రార్‌కు పెళ్లి కోసం దరఖాస్తు పెట్టుకోవాలి. దరఖాస్తు తేదీ నుంచి 30 రోజులవరకు ఇరు వర్గాల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. వాటి పరిశీలన, విచారణ అనంతరం (30 రోజుల గడువు తర్వాత) అధికారికంగా వివాహ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

