డేగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది పూణే భామ ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal). ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ప్రాధాన్యమున్న రోల్స్ లో మెరిసే ప్రగ్యాజైశ్వాల్ ప్రస్తుతం బాలకృష్ణ తో కలిసి అఖండ (Akhanda)చిత్రంలో నటిస్తోంది. సోషల్‌మీడియాలో ఈ భామ చురుకుగా ఉంటుందనే విషయం తెలిసిందే.
అప్పుడపుడు తన వర్కవుట్ సెషన్ (workouts)కు సంబంధించిన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫిట్నెస్ సెషన్ వీడియో వైరల్ అవుతోంది. రెడ్ స్పోర్ట్స్ లో టాప్, గ్రే కలర్ ప్యాంట్లో ఉన్న ప్రగ్యాజైశ్వాల్ ఫ్లిప్స్, కేటిల్ బెల్ స్క్వాట్స్ (kettlebell squats), పుష్ అప్స్, బాటిల్ రోప్ వర్కవుట్స్ (battle rope workouts)తో పలు ఫిట్ నెస్ టిప్స్ ను ప్రయత్నిస్తూ..చాలా మందిలో స్పూర్తిని నింపుతుంది. ప్రతీ రోజూ యాక్టివ్‌గా, ఫిట్ గా కనిపించేందుకు చెమటోడుస్తూ తన శక్తిని ఖర్చు చేస్తుంది ప్రగ్యాజైశ్వాల్.
Source by pragya jaishwal instagram :
భారీ టైర్లను అవలీలగా ముందుకు నెడుతూ..డంబెల్స్ , థ్రెడ్‌తో యుద్దభూమిలో వారియర్‌లా సీరియస్ గా వర్కవుట్స్ చేస్తూ ఔరా అనిపిస్తోంది ప్రగ్యాజైశ్వాల్. ఈ సుందరి మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్, ఆయుష శర్మ కాంబోలో వస్తున్న అంథిమ్..ది ఫైనల్ ట్రుత్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్‌గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్