జైభీమ్ (Jai Bhim) చిత్రంలో వన్నియార్ సామాజిక వర్గాన్ని కించపరిచే సీన్లున్నాయని, ఆ సన్నివేశాలను తొలగించాలని పీఎంకే (PMK Leaders) పార్టీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సామాజిక వర్గానికి హీరోసూర్య (Suriya)తోపాటు డైరెక్టర్ జ్ఞానవేల్ (T. J. Gnanavel) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జ్ఞానవేల్ దిగొచ్చారు.
పీఎంకే నేతలకు క్షమాపణలు చెప్పారు జ్ఞానవేల్. తనకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని, దళితులపై దాడులను చూపించే ప్రయత్నమే జైభీమ్ సినిమా అని జ్ఞానవేల్ స్పష్టం చేశారు. నటుడు సూర్యను లక్ష్యంగా పెట్టుకోవడం సరికాదు. సూర్య ఫ్యామిలీ సినిమాలు విడుదల చేయొద్దని రెచ్చగొట్టడం సరికాదు. పూర్తి బాధ్యత తనదేనని అన్నారు జ్ఞానవేల్.
దొంగతనం కేసులో అక్రమంగా ఇరికించబడిన ఓ అమాయక వ్యక్తి లాకప్ డెత్ కేసును చేధించిన లాయర్ పాత్రలో సూర్య నటనకు ప్రేక్షక లోకం నీరాజనం పలుకుతున్నారు. లాకప్ డెత్‌కు గురైన వ్యక్తి పాత్రలో కే మణికందన్, అతడి భార్యగా లిజొమోల్ జోస్ కనిపించింది. గర్భిణీ మహిళగా లిజొమోల్ జోస్ యాక్టింగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తోంది. హోం ప్రొడక్షన్స్ 2డీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?