టాలీవుడ్ (Tollywood) హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం బంగార్రాజు (Bangarraju) ప్రాజెక్టులో కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున (Nagarjuna) లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ ప్రాజెక్టుకు కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు (Naga Chaitanya birthday) సందర్భంగా మేకర్స్ చైతూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. బంగార్రాజు గెటప్‌లో నాగార్జున కర్ర నేలకేసి కొట్టి ఎగరేసినట్టుగా చేస్తూ నాగచైతన్య ఇంట్లోనుంచి బయటకు వస్తున్నాడు.
అయితే పంచెకట్టులో కాకుండా టోన్డ్ జీన్స్, పూల చొక్కాలో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. సిటీకి చెందిన వ్యక్తిగా చైతూ కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది. చైతూ పాత్ర వినోదాన్ని పంచడం ఖాయమని లేటెస్ట్ లుక్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణ. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా..నాగచైతన్యకు జోడీగా కోలీవుడ్ బ్యూటీ కృతిశెట్టి కనిపించనుంది.
Here is the First Look of
— BA Raju's Team (@baraju_SuperHit) November 22, 2021
🔥బంగార్రాజు🔥
YuvaSamrat @chay_akkineni
King @iamnagarjuna @IamKrithiShetty @kalyankrishna_k @AnnapurnaStdios @anuprubens @ZeeStudios_ @lemonsprasad#Bangarraju #BangarrajuComing#HBDChay pic.twitter.com/gOQIcJtV1r
ఇప్పటికే కృతిశెట్టి లుక్ విడుదలవగా అద్బుతమైన స్పందన వస్తోంది. రేపు బంగార్రాజు టీజర్ ప్రకటన చేయనున్నారు మేకర్స్. నాగార్జున హోం బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ తో కలిసి ఈ చిత్రాన్నినిర్మిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో బంగార్రాజుగా డబుల్ ఎంటర్టైన్మెంట్ను పంచేందుకు రెడీ అవుతున్నాడు నాగార్జున.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Thaman AKhanda Update | అఖండపై థమన్ ఇచ్చిన క్రేజీ అప్ డేట్ ఎంటో తెలుసా..?
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!