Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో భీమ్లానాయక్ (Bheemla Nayak)సినిమా చేస్తున్నాడు సాగర్ కే చంద్ర (Sagar K Chandra) .ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

అతడు చేసింది రెండు సినిమాలే..అవి కూడా చిన్న సినిమాలు..మూడో సినిమాకు ఏకంగా స్టార్ హీరోతో పనిచేసే అవకాశం కొట్టేశాడు. ఆ యువ దర్శకుడే సాగర్ కే చంద్ర (Sagar K Chandra). ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో భీమ్లానాయక్ (Bheemla Nayak)సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన అయ్యప్పనుమ్ కొషియుమ్ ప్రాజెక్టుకు రీమేక్‌గా వస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.

భీమ్లా నాయక్ గురించి ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చినపుడు కేవలం రానా (Bheemla Nayak)కు ఓ పాత్ర ఉందని మాత్రమే తెలుసు. పవన్ కల్యాణ్ మెయిన్ లీడ్ చేస్తున్నారని త్రివిక్రమ్ శ్రీనివాస్ నాకు చెప్పే వరకు ఆ విషయం తెలియదు. భీమ్లా నాయక్ ఒకే అవ్వగానే చాలా ఉత్సాహం వచ్చింది. ఒరిజినల్ వెర్షన్లో మార్పుల గురించి మాట్లాడుతూ..పవన్ కల్యాణ్, రానా స్టార్ డమ్‌ను దృష్టిలో పెట్టుకుని కథను బ్యాలెన్సింగ్ గా సిద్దం చేసినట్టు చెప్పాడు.

2 రోజుల్లోనే పవన్‌తో కలిసిపోయా..
మలయాళంలో నెగెటివ్ షేడ్స్ లో నటించిన బిజూ మీనన్ కంటే పృథ్విరాజ్ సుకుమారన్ ఎక్కువ పాపులర్. కానీ తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ స్టార్ కంటే ఎక్కువ. తెలుగులో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేశామన్నాడు సాగర్ కే చంద్ర. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను అద్బుమైన సాంకేతిక నిపుణుడిగా భావిస్తానన్న సాగర్..రానాను దోసకాయలాంటి చల్లని స్వభావం కలిగిన వ్యక్తిగా అభివర్ణించాడు. ఇక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌తో కలిసి పోవడానికి తనకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టిందని చెప్పుకొచ్చాడు సాగర్ కే చంద్ర.

భీమ్లా నాయక్‌లో నిత్యమీనన్, మలయాళ భామ సంయుక్తా మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇది కూడా చూడండి
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

