e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌లో స‌ల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన స‌ల్లూ భాయ్‌

చిరంజీవి గాడ్‌ఫాద‌ర్‌లో స‌ల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన స‌ల్లూ భాయ్‌

By Maduri Mattaiah

salman khan in chiranjeevi god father
salman khan in god father

salman khan in god father | కథానాయకుడు ఆయుష్‌తో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌..కలిసి నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘అంతిమ్‌’ సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రానికి మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా బుధవారం ‘అంతిమ్‌’టీమ్‌తో కలిసి సల్మాన్‌ హైదరాబాద్‌కు వచ్చారు సల్మాన్ ఖాన్‌. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో సల్మాన్‌ఖాన్‌ ప్రత్యేకంగా ముచ్చటించారు.

- Advertisement -

హాయ్‌ సార్‌.. వెల్‌కమ్‌ టు హైదరాబాద్‌..?

ఐలవ్‌ హైదరాబాద్‌.. నా ప్రతి సినిమా ప్రమోషన్‌కు హైదరాబాద్‌కు రావడానికి ప్రయత్నిస్తాను.

ప్రతి సినిమా విడుదల సమయంలో ప్రమోషన్‌ టూర్స్‌ ప్లాన్‌ చేస్తారా?

సాధారణంగా నేను సినిమా విడుదలకు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తుంటాను. అయితే ఇప్పుడు టైగర్‌ సినిమా షూటింగ్‌ కారణంగా ఈసారి నాకు టైమ్‌ కుదరలేదు. సినిమాకు మంచి స్పందన వస్తే తప్పకుండా టైమ్‌ తీసుకుని రావాలనుకున్నాను. అందుకనే ఇప్పుడు హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడి ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పడానికి వచ్చాను.

మీ చెల్లి భర్త ఆయుష్‌ నటనకు ఈ సినిమాలో ఎలాంటి స్పందన వస్తుంది?

ఆయుష్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రేక్షకులు బాగా రీసీవ్‌ చేసుకుంటున్నారు. ఆయుష్‌ ఇందులో కీలక పాత్ర చేశాడు. పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇకపై ఇంకా కష్టపడాలి. వైవిధ్యమైన కథలను ఎంచుకోవాలి.ఆయుష్‌లో సినిమాల పట్ల, కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల చాలా ఆసక్తి ఉంది.

మీ చిత్రాలను సాధారణంగా తెలుగులో డబ్‌ చేసి విడుదల చేస్తారు? ఈ సినిమాను ఎందుకు డబ్‌ చేయలేదు?

నేను దబాంగ్‌ సినిమాను తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశాం. కానీ అంతిమ్‌ సినిమాకు అంత సమయం లేదు. కరోనా కారణంగా గ్యాప్‌ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వస్తుంది. అందుకనే ఈసారి డబ్బింగ్‌పై ఫోకస్‌ పెట్టలేదు. అయితే నా తదుపరి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాను.

గతంలో చేసిన పోలీస్‌ పాత్రలకు ‘అంతిమ్‌’లో మీరు చేసిన పోలీస్‌ పాత్రకు మీరు గమనించిన తేడా?

దబాంగ్‌లో నేను చేసిన చుల్‌బుల్‌ పాండేకు అంతిమ్‌లో చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రకు పూర్తి భిన్నంగా డిజైన్‌ చేశారు.

మరాఠి సినిమాను రీమేక్‌గా ఈ చిత్రాన్ని చేయడానికి కారణం?


నాకు స్క్రిప్ట్‌ నచ్చకపోతే సినిమా చేయను. అంతిమ్‌ కథ నాకు బాగా నచ్చింది. అందుకే రీమేక్‌ చేశాను.

‘అంతిమ్‌’ ఏ జానర్‌ సినిమాగా మీరు అభివర్ణిస్తారు?

క్లాస్‌, మాస్‌ మల్టీప్లెక్స్‌సినిమా చేయాలని ఆలోచించలేదు. మంచి సినిమా చేయాలని అనుకున్నాను. అంతిమ్‌ కథ నచ్చింది. ఇక ఏమీ ఆలోచించకుండా మొదలుపెట్టాను.

మీ అభిమానులకు మీరు కొన్ని సూచనలు చేస్తున్నారని తెలిసింది?

ఈ సినిమా ప్రదర్శన సమయంలో కొందరు అభిమానులు థియేటర్స్‌లో టపాసులు కాల్చారు. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. సోషల్‌మీడియా ద్వారా వారిని వద్దని వారించాను. పాలాభిషేకం కోసం ఉపయోగించే పాలను పేదలకు పంచి పెడుతున్నారని తెలిసింది. చాలా మంచి విషయమది.

తెలుగు సినిమాలు చేస్తున్నారని తెలిసింది?

చిరంజీవి ‘గాడ్‌ఫాదర్‌’లో నటిస్తున్నాను. వెంకటేష్‌తోనూ సినిమా చేస్తున్నాను. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.

ఓటీటీకి సినిమా చేసే ఆలోచన ఉందా?

ఓటీటీలో డిఫరెంట్‌ కంటెంట్‌ సినిమాలు వస్తున్నాయి. అవకాశం వస్తే క‌చ్చితంగా ఓటీటీ సినిమా చేస్తాను.

మీ భవిష్యత్‌ చిత్రాలు?

దబాంగ్‌-4తో పాటు సాజిద్‌ సినిమాలను చేయాల్సి ఉంది.

interview by; maduri mattaiah

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Salman Khan Fans | స‌ల్మాన్‌ఖాన్ ఎక్క‌డికెళ్లాడో చూడండి..? సెల్ఫీల కోసం ఫ్యాన్స్ పోటీ

Allu Arjun: బిగ్ బాస్ స్టేజ్‌పై స‌ల్మాన్‌తో క‌లిసి సంద‌డి చేయ‌నున్న అల్లు అర్జున్

Salman Khan: త‌న అభిమానుల‌ని త‌ప్పుబ‌ట్టిన స‌ల్మాన్ ఖాన్.. ఎందుకో తెలుసా?

Salman With Chiranjeevi | చిరంజీవి-స‌ల్మాన్‌ఖాన్ స్పెష‌ల్ సాంగ్ ఉండ‌బోతుందా..?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement