టాలీవుడ్ (Tollywood) హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి గాడ్ ఫాదర్ (Godfather). కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీలో మెరవనున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. తాజాగా బయటకు వచ్చిన ఆసక్తికర విషయమేంటంటే..సల్మాన్ ఖాన్ (Salman Khan), చిరంజీవి ఒకే స్టేజీపై డ్యాన్స్ చేయబోతుండటం.
ఎస్ థమన్ కంపోజిషన్‌లో వచ్చే పాటలో చిరు, సల్మాన్ కలిసి స్టెప్పులేయనున్నారన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు రీమేక్ గా వస్తోంది గాడ్ ఫాదర్. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని కొంత భాగాన్ని ఇప్పటికే ఊటీలో చిత్రీకరించారు. గాడ్ ఫాదర్ ను రాంచరణ్, ఎన్వీప్రసాద్, ఆర్ బీ చౌదరితో కలిసి నిర్మిస్తున్నాడు. గాడ్ ఫాదర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై మేకర్స్ ఇచ్చే అప్ డేట్స్ క్లారిటీ రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి