Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
అందం, అభినయంతోపాటు అద్బుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకునే టాలెంట్ సాయిపల్లవి (Sai Pallavi) సొంతం. కెరీర్ తొలి నాళ్ల నుంచి సాయిపల్లవి సీరియస్ రోల్స్, బాధ్యతతో కూడిన పాత్రల్లోనే కనిపిస్తూ వస్తోంది.

దక్షిణాదిన (South Film Industry) ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). అందం, అభినయంతోపాటు అద్బుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకునే స్వభావం ఈ బ్యూటీ సొంతం. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా కథాబలమున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. స్క్రిప్ట్, పాత్ర నచ్చకపోతే పక్కన పెట్టేస్తుంది. కెరీర్ తొలి నాళ్ల నుంచి సాయిపల్లవి సీరియస్ రోల్స్, బాధ్యతతో కూడిన పాత్రల్లోనే కనిపిస్తూ వస్తోంది.
అయితే ఈ సారి మాత్రం సాయిపల్లవి కొంత మారాలని నిర్ణయించుకుందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ మార్పు ఏంటో చెప్పుకొచ్చింది. తనలోని కామెడీ యాంగిల్ (Comedy skill)ను ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్నట్టు చెప్పింది సాయిపల్లవి. కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్గా చూపించే సరైన కథ కోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు గ్లామరస్, ఫర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాలతో అందరినీ పలుకరించిన సాయిపల్లవి..తనలో కామెడీ చేసే యాంగిల్ కూడా ఉందని, వీలైనంత తన కామెడీతో అందరికీ నవ్వులు పూయిస్తానని చెప్పకనే చెబుతుంది.
మరి సాయిపల్లవిలో ఉన్న కామెడీ స్కిల్‌ను ఎంతమంది దర్శకులు వినియోగించుకుంటారో చూడాలి. ఇటీవలే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్‌స్టోరీ చిత్రం బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాలున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

