Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
సినిమాల టైటిల్స్ తో క్యూరియాసిటీని పెంచే యాక్టర్ల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). తాజాగా ఈ కుర్ర హీరో ఓరి దేవుడా (Ori Devuda) అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

సినిమాల టైటిల్స్ తో క్యూరియాసిటీని పెంచే యాక్టర్లు కొద్ది మందే ఉంటారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటాడు టాలీవుడ్ (Tollywood) యువ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ఫలక్‌నుమా దాస్ చిత్రంతో సోలో హీరోగా తెలుగు ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఏడాది పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విశ్వక్సేన్ కు ఈ చిత్రం నిరాశే మిగిల్చింది. తాజాగా ఈ కుర్ర హీరో ఓరి దేవుడా (Ori Devuda) అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఓ మై కడవులే తెలుగు రీమేక్ (Oh My Kadavule Telugu remake) గా వస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఓరి దేవుడా అని టైటిల్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ (Mithila Palkar) ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
ఈ కుర్ర హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు. విద్యాసాగర్ చింత దర్శకత్వంలో అశోకవనంలో అర్జుణ కళ్యాణం మూవీ చేస్తున్నాడు. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీంతోపాటు గామి, అక్టోబర్ 31 లేడీస్ నైట్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. హీరోయిన్ విశ్వక్ సేన్ నడుముకు తాడు కట్టి లాగుతుండగా..విశ్వక్ సేన్ సీతాకోక చిలుకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

