Kamal Haasan With Star Director | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
విలక్షణ నటనకు, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్ (Kamal Haasan). విక్రమ్ (Vikram) మూవీ సెట్స్ పై ఉండగానే కమల్‌హాసన్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇపుడు అటు కోలీవుడ్, ఇటు ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.

విలక్షణ నటనకు, ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్ (Kamal Haasan). ఈ కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో కలిసి విక్రమ్ (Vikram) సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే షూటింగ్‌కు ప్యాకప్ చెప్పనుంది కమల్ టీం. కాగా ఈ మూవీ సెట్స్ పై ఉండగానే కమల్‌హాసన్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఇపుడు అటు కోలీవుడ్, ఇటు ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్ తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నట్టు తాజా టాక్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌటు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కాలా, కబాలి లాంటి చిత్రాలను తెరకెక్కించిన పా రంజిత్ (Pa Ranjith) చెప్పిన కథకు కమల్ హాసన్ ఓకే చెప్పేసినట్టు ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. పా రంజిత్ రాసిన స్క్రిప్ట్, కథనం నచ్చిన కమల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇటీవలే విక్రమ్ సెట్స్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు కమల్‌హాసన్. విక్రమ్ టీజర్లో సాల్ట్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చి..సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు లోకేశ్కనగరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

