AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
ఏఆర్ రెహమాన్ (AR Rahman), రజనీకాంత్ (Rajinikanth)..ఈ లెజెండరీల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు పండగే. అయితే రజనీకాంత్ సినిమాకు పనిచేయడమంటే నరకంలా అనిపించేదని చెప్పుకొచ్చాడు ఏఆర్ రెహమాన్.

ఏఆర్ రెహమాన్ (AR Rahman), రజనీకాంత్ (Rajinikanth) ..ఒకరు తన సంగీతంతో సినీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే టాలెంట్ కలిగిన వ్యక్తి. మరొకరు తన స్టైల్, మ్యానరిజం, యాక్టింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని సూపర్‌స్టార్‌గా ఎదిగిన వ్యక్తి. ఈ లెజెండరీల కాంబినేషన్లో సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ కు పండగే. రజనీకాంత్ నటించిన ముత్తు (Muthu), శివాజీ..ది బాస్ (Sivaji..The Boss), రోబో (Enthiran), రోబో 2.0 చిత్రాలకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమాలు బాక్సాపీస్ వద్ద మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే రజనీకాంత్ సినిమాలకు పనిచేసిన రోజులు అంత ఆహ్లాదకరంగా ఏం ఉండేవి కాదని, ఆయన సినిమాకు పనిచేయడమంటే నరకంలా అనిపించేదని చెప్పుకొచ్చాడు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. సినిమాలకు పనిచేసినప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఓ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ..ఇపుడు కొంత బెటర్‌గా ఉంది. ఆ రోజుల్లో రజనీకాంత్ సినిమాలకు మార్చి కాలంలో పనిచేయడం మొదలు పెడితే దీపావళికి విడుదలయ్యేవి. సినిమాకు పాటలు, బీజీఎం చేయాల్సి ఉంటుంది. నేనుండే ప్రదేశంలో విద్యుత్ చాలా విరివిగా ఉంటుంది. నా దగ్గర రెండు జనరేటర్లుండేవి ఇది నరకం. రజనీకాంత్ చిత్రాలకు చాలా తక్కువ సమయం ఉండటంతో ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

