Allu Arjun: బిగ్ బాస్ స్టేజ్‌పై సల్మాన్‌తో కలిసి సందడి చేయనున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ నెవర్ బిఫోర్ అనేలా పుష్ప సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర బడ్జెట్ 180 కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో రష్మిక మందన పాత్ర కూడా సరికొత్తగా ఉంటుందని విడుదలైన పోస్టర్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 6వ తేదీన సోమవారం విడుదల చేయాలని అనుకుంటున్నారట.
ఇప్పటికే పుష్ప టీజర్ యూ ట్యూబ్ లో సంచలన రికార్డులను సొంతం చేసుకుంది.ట్రైలర్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. అయితే హిందీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనే విషయంలో ఇంతవరకు ఒక క్లారిటీకి రాలేదు కాని అక్కడ కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేయాలని అనుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ అందరికీ తెలిసిన పేరు కాబట్టి ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్స్ చేయాలని అనుకుంటున్నారు. హిందీలో ఈ మూవీని ప్రమోట్ చేసేందుకు స్వయంగా బన్నీనే రంగంలోకి దిగుతున్నాడట!
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ 15వ సీజన్లో బన్నీ స్పెషల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ, సల్మాన్ ఖాన్లకు ఇదివరకే పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన దువ్వాడ జగన్నాథం(డీజే)లోని సీటీమార్ సాంగ్ సల్మాన్ రాధే మూవీలో వాడారు. ఈ పాట వాడుకోనిచ్చినందుకు సల్లూ భాయ్ బన్నీకి థ్యాంక్స్ చెప్పడంతో పాటు మీ స్టెప్పులు అదిరిపోయానని కాంప్లిమెంట్ ఇచ్చాడు. మీ నుంచి ఇలాంటి ప్రశంస అందుకోవడం సంతోషమంటూ బన్నీ కూడా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

