ఫలితాలు ప్రకటించకుండానే ఫీజుల స్వీకరణ
ఫలితాలు విడుదల చేయాలి. రీ వెరిఫికేషన్.. రీ కౌంటింగ్‌కు అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఫెయిలైన వారి నుంచి పరీక్ష ఫీజు స్వీకరించాలి.
- ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ నిర్వాకం
- గందరగోళంలో డిగ్రీ బ్యాక్లాగ్ విద్యార్థులు
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఫలితాలు విడుదల చేయాలి. రీ వెరిఫికేషన్.. రీ కౌంటింగ్‌కు అవకాశమివ్వాలి. ఆ తర్వాత ఫెయిలైన వారి నుంచి పరీక్ష ఫీజు స్వీకరించాలి. ఇది సాధారణం గా జరిగే పరీక్షల ప్రక్రియ. కానీ ఇవేవీ లే కుండా.. అసలు ఫలితాలే విడుదల చేయకుండానే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి ఫీజులు స్వీకరిస్తున్నది. విద్యార్థుల జేబులకు చిల్లులు పెడుతున్న ది. వందేండ్ల చరిత్ర గల ఈ వర్సిటీ చర్య లు విస్తుగొలుపుతున్నాయి. వర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల్లో 2021-22, 2022-23 బ్యాచ్‌ల్లో కొందరు బ్యాక్లాగ్ విద్యార్థులున్నారు. వీరు ఫెయిలైన సబ్జెక్టులకు 2025 నవంబర్‌లో పరీక్షలు రాశారు. అయితే ఆయా పరీక్షల ఫలితాలు వర్సిటీ అధికారులు ఇంకా విడుదల చేయలేదు. కానీ ఈ పరీక్షల్లో ఫెయిలైనవారు ఈనెల 16లోపు కాలేజీల్లో ఫీజు చెల్లిస్తే.. కాలేజీ యాజమాన్యాలు ఈ నెల 17 లోపు ఫీజు చెల్లించాలని గడువు విధించారు.
గడువు ముగిసిన తర్వాత రూ. 500 జరిమానాతో ఫీజు చెల్లించాలని సూచించారు. అయితే ఫలితాలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఏ సబ్జెక్టులకు ఫీజు కట్టాలన్న గందరగోళంలో ఉన్నారు. ఫీజు కట్టిన తర్వాత ఆయా సబ్జెక్టులు పాసైతే ఫీజులు వాపసు చేస్తారా..? అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫలితాలు విడుదల చేయకుండానే ఫీజుల స్వీకరణ షెడ్యూల్‌ను ఎలా విడుదల చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఓ విద్యార్థిని బుధవారం బాగ్‌లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ కాలేజీకి ఫీజు చెల్లించేందుకు వెళ్లగా ఫలితాలు ఇంకా రాలేదని.. అయినా ఫీజు కట్టాలని కాలేజీ అధికారులు సూచించారు. దీంతో ఆ విద్యార్థిని ఫీజు చెల్లించకుండానే వెనుదిరిగింది. ఇదే విషయంపై ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ డాక్టర్ శశికాంత్ స్పందిస్తూ.. గడువులోగా ఫలితాలు విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఒకటి రెండు రోజులు ఫీజు చెల్లింపు గడువు పొడిగిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

