Allahabad HC | మహిళలు వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు.. ఇస్లాంలోకి మారిన యువతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
Allahabad HC : మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని హైకోర్టు ఆదేశించింది.
Allahabad HC : మహిళలు మతాన్ని పాటించే అంశంలో అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. నిర్ణీత వయస్సు వచ్చిన మహిళలు (అడల్ట్ ఉమన్) తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని హైకోర్టు ఆదేశించింది. పెళ్లి, మతాన్ని స్వీకరించడం, నివాసం, భవిష్యత్ వంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు యువతులకు సంబంధించి దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ సందీప్ జైన్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఈ కేసులో బాధిత యువతుల్ని ఆగష్టు 6 లోగా కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది.
ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. దివ్యా భాటియా, అన్షు భాటియా అనే ఇద్దరు అక్కచెళ్లెల్లు.. ఇద్దరు ముస్లిం యువకులను ప్రేమించారు. ఈ క్రమంలో ఆ యువతులు ఇస్లాంలోకి మారారు. వారి పేర్లు దివ్యా భాటియా నుంచి జోయా దియా భాటియాగా, అన్షు భాటియా నుంచి అమీనా అన్షు భాటియాగా మార్చుకున్నారు. అంతేకాదు.. ఇస్లాంకు చెందిన యువకుల్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. దీన్ని వ్యతిరేకించిన వారి తండ్రి, ఆ ఇద్దరినీ తన ఇంట్లో బంధించారు. వారు మతం మారడాన్ని, వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు యువతుల్ని వారి తండ్రి బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ, వారిని విడుదల చేయాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో వారి తరఫున హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషన్లో దాఖలు చేసిన వివరాల ఆధారంగా కీలక వ్యాఖ్యలు చేసింది. దివ్యా, అన్షులను ఆగష్టు 6లోగా కోర్టులో హాజరుపర్చాలని స్థానిక పోలీసులను ఆదేశించింది.
పిటిషనర్ ఆరోపించినట్లుగా పోలీసుల సహకారంతో వారి తండ్రి, వారిని బంధించి ఉంచితే అది చట్టబద్ధమైన నేరంగా పరిగణిస్తామని తెలిపింది. మహిళలు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు, నివాసాన్ని ఎంచుకునే హక్కు, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు, భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు వారికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరినీ స్వేచ్ఛగా వదిలిపెట్టాలని కోర్టు తండ్రికి సూచించింది. అక్రమంగా బంధించి ఉంచడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అని చెప్పింది. తమ గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఆ అక్కాచెల్లెళ్లకు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 6లోగా ఇద్దరినీ హాజరుపర్చాలని ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

