Pune Family Suicide | కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమని అనుమానం
Pune Family Suicide | ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
ముంబై: ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ ఇంటి గదిలో ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. (Pune Family Suicide) మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న 50 ఏళ్ల వినోద్ పిళ్లై, ఐఐఎం అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. ఆయన భార్య 45 ఏళ్ల సిర్జా ఒక స్కూల్లో కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నది. వారికి 19 ఏళ్ల కుమార్తె పూర్ణిమ ఉన్నది.
కాగా, శనివారం సిర్జా విధులకు హాజరుకాకపోవడం ఆమెను సంప్రదించేందుకు సహోద్యోగులు ప్రయత్నించారు. మొబైల్ కాల్స్‌కు స్పందించకపోవడంతో ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు ఆ ఇంటికి వెళ్లి చూడగా వినోద్, అతడి భార్య, కుమార్తె అచేతనంగా పడి ఉన్నారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్‌తో పాటు సోడియం నైట్రేట్ ఉన్న డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య సహాయం అందకముందే వినోద్ మరణించాడు. ఆయన భార్య సిర్జా, కుమార్తె పూర్ణిమకు ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే వారిద్దరు కూడా చనిపోయారు.
కాగా, వినోద్ ఆన్లైన్లో సోడియం నైట్రేట్ ఆర్డర్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ రసాయనాన్ని మండించడం వల్ల వెలువడిన పొగ వల్ల ఆ కుటుంబంలోని ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ చర్యకు పాల్పడినట్లు, దీనికి మరెవరినీ బాధ్యులను చేయవద్దని వినోద్ ఆ లేఖలో రాసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఆ కుటుంబం కొంతకాలంగా భారీ అప్పులతో సతమతమవుతున్నట్లు దర్యాప్తులో తెసిందని పోలీస్ అధికారి చెప్పారు. మూడేళ్ల క్రితం నెహ్రూ నగర్‌లోని తమ ఇంటిని అమ్ముకున్నారని, ఆ తర్వాత నుంచి మోర్వాడి ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివసిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dies
- family
- financial distress
- Pune
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

