Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు.. ఇదుగో సాక్ష్యం

Tollywood | కొంతమంది హీరోలకు సొంత పేర్లు అసలు కలిసి రావు. అదేంటి అనుకుంటున్నారా.. నిజ జీవితంలో వాళ్ల పేర్లు ఓకే కానీ.. అదే పేరు సినిమా టైటిల్‌గా పెడితే మాత్రం అసలు కలిసి రాలేదు. తెలుగు ఇండస్ట్రీలో అగ్రహీరోలు చాలామంది తమ సొంత పేర్లు సినిమా టైటిల్‌గా పెట్టుకొని చేశారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి నిన్నమొన్నటి అఖిల్ అక్కినేని వరకు అందరూ ఇదే దారిలో ఫాలో అయ్యారు. కానీ ఒక్కరికి కూడా అదృష్టం కలిసి రాలేదు.
ముందుగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ కొత్తలో తన టైటిల్‌తో ఒక సినిమా చేశాడు. చిరంజీవి టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పైగా ఇందులో ఆయన విలన్ కం హీరో. అనుకోకుండా ఒక హత్య చేసి దాన్ని కప్పి పెట్టే ప్రయత్నంలో వరుసగా హత్యలు చేస్తూ ఉంటాడు చిరంజీవి. చివరికు పోలీస్ ఆఫీసర్ అయిన తండ్రి కైకాల సత్యనారాయణ చేతిలో చనిపోతాడు. ఇక 2005లో జై చిరంజీవ టైటిల్‌తో ఒక సినిమా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.
బాలకృష్ణ తన సొంత పేరుతో సినిమా చేయకపోయినా.. తన బిరుదుతో ఒక సినిమా చేశాడు. అదే యువరత్న రానా. ఇది కూడా డిజాస్టర్ అయింది. వెంకటేశ్ తన సొంత పేరు టైటిల్‌గా చేసిన సినిమా వెంకీ మామ జస్ట్ యావరేజ్‌గా ఆడింది. నాగార్జునకు సైతం సొంత పేరు అసలు కలిసి రాలేదు. 1986 లో కెప్టెన్ నాగార్జున పేరుతో ఒక సినిమా చేశాడు అక్కినేని వారసుడు. ఇది బాక్సాఫీసు దగ్గర డిజాస్టర్. సూపర్ స్టార్ కృష్ణ కూడా తన పేరుతో కెప్టెన్ కృష్ణ అని చేశాడు. 1979లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.
ఈ తరం హీరోలకు కూడా ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అయింది. అఖిల్ అక్కినేని మొదటి సినిమా సొంత పేరుతో వచ్చి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. రామ్ చరణ్ కూడా వినయ విధేయ రామ అంటూ.. తన పేరులోని మొదటి రెండు అక్షరాలు టైటిల్‌గా పెట్టుకొని వచ్చాడు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలను అందుకోలేదు. ఇక నాగచైతన్య దోచెయ్, ఎన్టీఆర్ kaNTRi కూడా ఫ్లాప్ అయ్యాయి. మొత్తానికి మన హీరోలకు సొంత పేరు టైటిల్ అసలు కలిసి రాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?
టాలీవుడ్లో మారుతున్న ఈక్వేషన్స్.. మెగా ఇమేజ్ నుంచి బయటపడే ఆలోచనలో అల్లు అర్జున్
kgf – kaikala satyanarayana | కేజీఎఫ్ సినిమాతో కైకాల కు సంబంధమేంటి?
ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట
జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా
కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. భార్యతో గొడవలే ఆత్మహత్యకు కారణమా?
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

