ఆ సినిమా తీసినందుకు ఈవీవీని అంతలా తిట్టారా.. సంచలన విషయాలు బయటపెట్టిన కోట

అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు.. ఖలేజా సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఈ మాటలు చాలా సందర్భాల్లో సరిపోతాయి. దాదాపు 25 ఏళ్ల కిందట వచ్చిన ఒక సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అది సెట్స్‌పై ఉన్నప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి సినిమాలు తీస్తే అనవసరంగా ఉన్న పరువు పోతుంది అంటూ.. సదరు దర్శకుడిని అవమానించారు. సినిమా మధ్యలో ఆపేయమని నిరుత్సాహపరిచారు. కానీ విడుదలైన తర్వాత అదే సినిమా సంచలన విజయం సాధించి.. తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తిండిపోయే హాస్యభరిత చిత్రంగా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. ఆ సినిమానే జంబలకిడిపంబ.. ఆ దర్శకుడే ఈవీవీ సత్యనారాయణ. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈవీవీ ఎదుర్కొన్న విమర్శలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తాజాగా నోరువిప్పారు.

తెలుగు ఇండస్ట్రీలో కామెడీకి సరికొత్త కేరాఫ్ అడ్రస్ చూపించిన దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ . ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు లాంటి కామెడీ సినిమాలు మాత్రమే కాదు.. ఆమె లాంటి ఎమోషనల్ సినిమాలు.. అమ్మో ఒకటో తారీఖు లాంటి కుటుంబ కథా చిత్రాలు కూడా చేశాడు ఈవీవీ సత్యనారాయణ. అయితే ఈయన కెరీర్లో పూర్తిగా విభిన్నమైన కథతో చేసిన సినిమా జంబలకడిపంబ. ఈ ఆలోచన వచ్చినప్పుడు కేవలం 50 లక్షలతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈవీవీ. ఒక మహర్షి ఇచ్చిన మందు కారణంగా ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోయే కథ ఇది.
ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు వైజాగ్‌లో కోట శ్రీనివాసరావు సహా దాదాపు 15 మంది కమెడియన్స్ మెడలో తాళిబొట్లు వేసుకొని వీధుల్లో తిరిగారు. ఇది చూసిన తర్వాత ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ దర్శకుడు.. ఇలాంటి సినిమాలు చేసే కంటే కూడా వ్యభిచారం చేసుకోవచ్చు కదా అంటూ.. నోటికి వచ్చినట్లు విమర్శించాడు. ఈవీవీ సత్యనారాయణకు ఈ విషయం తెలిసి సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు దగ్గర వచ్చి బాధ పడ్డాడు. అయితే అలాంటి విషయాలు ఏవి పట్టించుకోవద్దు.. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టవుతుందని ఈవీవీకి హామీ ఇచ్చాడు కోట శ్రీనివాసరావు. తాజాగా ఈ విషయాన్ని సీనియర్ నటుడు కోట తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అందుకే ఏ సినిమాను కూడా ముందు జడ్జి చేయకూడదు. ఎందులో ఎంత విషయం ఉంటుందో ఎవరికీ తెలియదు అంటున్నాడు కోట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ నిర్మాతలు విసిగిపోతున్నారా..!
గోవాలో రోడ్డు ప్రమాదంలో ప్రియుడితో పాటు హీరోయిన్ దుర్మరణం
బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షో..
ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
Lobo: ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించిన లోబో.. తోటి వారితో చెప్పుకొని బాధపడ్డ ట్రాన్స్ జెండర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

