Ishwari deshpande | కోటి కలలతో సినిమా ఇండస్ట్రీకి వచ్చింది.. చిన్నప్పటి నుంచి పెద్ద హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఓకే ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని ముగించేసింది. ఏడడుగులు నడుస్తాడు అనుకున్న ప్రియుడితోనే చితి మంట వైపు అడుగులు వేసింది ఒక హీరోయిన్. సరదా కోసం వెళ్లిన హాలిడే ట్రిప్ వాళ్లకు విషాదాన్ని నింపింది. మరాఠీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న 25 ఏళ్ల ఈశ్వరి దేశ్ పాండే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది.
ఈశ్వరి దేశ్ పాండే తన ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలిడే ట్రిప్ కు వెళ్లింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 20 సోమవారం తెల్లవారుజామున ఇద్దరు ప్రయాణిస్తున్న కారు అర్పారో గ్రామ సమీపంలోని బాగా కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఆ సమయంలో కారు సెంట్రల్ లాక్ చేసి ఉండటంతో బయటకు రాలేక కారులోనే ఇరుక్కుపోయారు. ఈ దుర్ఘటనలో ఈశ్వరితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ శుభమ్ డెడ్జ్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరి మరణం మరాఠీ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నింపింది. హిందీ, మరాఠీ చిత్రాల్లో నటిస్తే ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది ఈశ్వరి. ప్రస్తుతం ఆమె నటించిన సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం అందర్ని కంటతడి పెట్టిస్తుంది.
చాలా నెలలుగా శుభమ్ తో ఈశ్వరికి పరిచయం ఉంది. నిజానికి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అక్టోబర్ లో నిశ్చితార్థం కూడా నిర్ణయించారు కుటుంబ సభ్యులు. కానీ ఇప్పుడు కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. సరదాగా ట్రిప్ కు వెళ్లి వస్తారు అనుకుంటే నిర్జీవంగా వచ్చిన వాళ్ల శవాలను చూసి కన్నీరు మున్నీరవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈశ్వరి మరణం ఆమె అభిమానులకు, సన్నిహితులకు తీరని శోకం మిగిల్చింది. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. ఏదేమైనా కొండంత భవిష్యత్తు ముందుండగా యాక్సిడెంట్ రూపంలో కాలం కాటు వేయడం మాత్రం ఊహించలేని విషాదం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పూజా హెగ్డే తీరుతో ప్రభాస్ నిర్మాతలు విసిగిపోతున్నారా..!
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన చిరంజీవి
కాజల్ మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్
ఎన్టీఆర్ షోలో మహేష్ ఎంత గెలుచుకున్నాడో తెలుసా?
Lobo: ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించిన లోబో.. తోటి వారితో చెప్పుకొని బాధపడ్డ ట్రాన్స్ జెండర్