కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. భార్యతో గొడవలే ఆత్మహత్యకు కారణమా?

uday kiran suicide letter | తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని పేరు ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సంచలనాలు సృష్టించిన హీరో ఈయన. ఒకటి రెండు కాదు.. వరసగా మూడు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకని చాలా మంది స్టార్ హీరోల కంటే ఎక్కువ మార్కెట్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే ఒకానొక సమయంలో జరిగిన చిన్న సంఘటన కారణంగా ఆయన కెరీర్ పూర్తిగా తలకిందులు అయిపోయింది. అప్పటి నుంచి అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు. ఇక చనిపోయే వరకు కూడా కోలుకోలేకపోయాడు. ఆర్ధిక ఇబ్బందులు, వ్యక్తిగత పరిస్థితుల కారణంగా జనవరి 5, 2014న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈయన రాసిన ఎమోషనల్ లెటర్ ఒకటి బయటకు వచ్చింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అది ఉదయ్ కిరణ్ రాతలోనే.. ‘విషితా మా అమ్మ అంటే ఎంత ఇష్టమో… ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకుల్, ఆంటీ చాలా బాధ పడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుసుకునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్‌గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధ పడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓ సారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా’ అని ఉంది. ఈ లేఖను చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చదివిన ఉదయ్ అభిమానులంతా ఆయనను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఇది ఉదయ్ కిరణ్ రాసిన లేఖనేనా కాదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
Priyanka Chopra: సమంత మాదిరిగా ప్రవర్తిస్తున్న ప్రియాంక.. విడాకులకి సిగ్నలా ఇది..!
Janhvi Kapoor | శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో..!!
RRR: పునీత్ స్టైల్లో నాటు నాటు సాంగ్.. వైరల్‌గా మారిన వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. వీడియో
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

