ఉదయ్ కిరణ్ కెరీర్లో ఆగిపోయిన సినిమాలు ఇవే..
తారజువ్వలా ఒక్కసారిగా పైకి ఎగిరి స్టార్ స్టేటస్ అందుకున్న ఉదయ్ కిరణ్.. అంతే స్పీడ్‌గా కింద పడిపోయాడు. దీంతో 10 సినిమాలు ఆయన చేజారిపోయాయి.

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ ఎవరైనా ఉన్నారా అంటే మరో అనుమానం లేకుండా ఉదయ్ కిరణ్ పేరు చెప్తారు అభిమానులు. ఆయన చనిపోయి ఏడేళ్లయినా కూడా ఇప్పటికీ ఉదయ్‌ని అభిమానులు మరిచిపోలేకపోతున్నారు. తారజువ్వలా ఒక్కసారిగా పైకి ఎగిరి స్టార్ స్టేటస్ అందుకున్న ఉదయ్ కిరణ్.. అంతే స్పీడ్‌గా కింద పడిపోయాడు. దీంతో ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 10 సినిమాలు ఆయన చేజారిపోయాయి. అందులో కొన్ని విడుదలకు ముందే నిలిచిపోగా.. మరికొన్ని షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఇంకొన్ని అయితే ఆనౌన్స్మెంట్ల వరకే పరిమితమయ్యాయి. ఉదయ్ కిరణ్ జయంతి సందర్భంగా.. కెరీర్లో ఆయన మిస్ చేసుకున్న ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..
ప్రేమంటే సులువు కాదురా
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం వరకు పూర్తయింది. ఆ తర్వాత అనుకోని కారణాలతో సినిమా ఆగిపోయింది.
ప్రత్యూష క్రియేషన్స్
ఉదయ్ కిరణ్, అంకిత జంటగా ప్రత్యూష క్రియేషన్స్ ఒక సినిమా మొదలు పెడదామని అనుకుంది. కానీ అనౌన్స్మెంట్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది.
అంజనా ప్రొడక్షన్స్ సినిమా
అంజనా ప్రొడక్షన్ బ్యానర్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అసిన్ జంటగా ఒక సినిమా తీయాలని అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సినిమా పట్టాలెక్కలేదు.
నర్తనశాల
బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో సౌందర్య కీలక పాత్రలో నర్తనశాల సినిమా తీయాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా సౌందర్య మరణించడంతో ఈ సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఈ సినిమాలో అభిమాన్యుడి పాత్ర కోసం ఉదయ్‌కిరణ్‌ను అనుకున్నారు.
జబ్ వి మెట్ తెలుగు రీమేక్
షాహిద్ కపూర్, కరీనా కపూర్ జంటగా రూపొందిన బాలీవుడ్ చిత్రం జబ్ వి మిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని అప్పట్లో అనుకున్నారు. ఇందులో ఉదయ్ కిరణ్, త్రిషను నాయికా నాయికలుగా అనుకున్నారు కానీ ఆ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు. ఇదే సినిమాను తమిళంలో ప్రేమిస్తే భరత్, తమన్నాలతో కందేన్ కందాలయి గా చిత్రీకరించారు. ఈ సినిమా తెలుగులోకి ప్రియ.. ప్రియతమా పేరుతో డబ్ అయింది.
సూపర్ గుడ్ ఫిల్మ్స్
తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్.. ఉదయ్ కిరణ్, సదా జంటగా ఓ సినిమా ప్లాన్ చేసింది. ఈ సినిమాకు లవర్స్ అని టైటిల్ కూడా అనుకున్నారు. కానీ ఎందుకో ఈ సినిమా పట్టాలెక్కలేదు.
ఆది శంకరాచార్య
ఉదయ్ కిరణ్ చేయాల్సిన భారీ సినిమా ఆదిశంకరాచార్య. ఈ సినిమా పట్టాలెక్కే సమయానికి ఉదయ్ కిరణ్ మార్కెట్ పడిపోయింది. దీంతో నిర్మాతలు సినిమాను ఆపేశారు.
ఎంఎస్ రాజు సినిమా
ఉదయ్ కిరణ్‌తో మనసంతా నువ్వే, నీ స్నేహం హిట్ సినిమాలు అందించిన ఎంఎస్ రాజు హ్యాట్రిక్‌గా మరో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది.
చంద్రశేఖర్ యేలేటి సినిమా
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన చంద్రశేఖర్ యేలేటి కూడా ఉదయ్ కిరణ్‌తో ఓ సినిమా అనుకున్నారు. కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయింది.
తేజ సినిమా
ఉదయ్ కిరణ్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు తేజ. వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం, నువ్వు నేను బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ డైలామా పడిన సమయంలో ఔనన్నా కాదన్న సినిమా తీసి హిట్ ఇచ్చాడు తేజ. కష్టాల్లో ఉన్న ఉదయ్ కిరణ్‌ను ఆదుకునేందుకు మరో సినిమా చేయాలని అనుకున్నాడు తేజ. కానీ ఆ సినిమా పట్టాలెక్కకముందే ఉదయ్ కిరణ్ తనువు చాలించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమం
‘మా’పై నాగబాబు మాటలు బాధించాయి: నటుడు నరేశ్
చిరంజీవి సినిమాపై ఈ కన్ఫ్యూజన్ ఇంకెన్ని రోజులో.. ?
మాస్ట్రో : ఓటీటీలో నితిన్ సినిమా ?
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

