మాస్ట్రో : ఓటీటీలో నితిన్ సినిమా ?
నితిన్ నటించిన మాస్ట్రో సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అప్పుడే తెరుచుకునేలా కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా సినిమా చూసేందుకు జనాలు వస్తారో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలను థియేటర్లలోనే విడుదల చేయాలని ఎదురుచూడటం కంటే ఓటీటీలో రిలీజ్ చేయడం బెటర్ అని కొంతమంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే నితిన్ నటించిన మాస్ట్రో సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ మంచి రేటు కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది మొదట్లో వచ్చిన భీష్మతో హిట్ కొట్టాడు నితిన్. కానీ ఆ తర్వాత విడుదలైన చెక్, రంగ్ దే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆయన కెరీర్ మళ్లీ డైలామాలో పడింది. ఈ పరిస్థితుల్లో ఆయన నటించిన మాస్ట్రో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది బాలీవుడ్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన అంధాధూన్ సినిమాకు రీమేక్. అక్కడ ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల కానుంది. ఇందులో నితిన్ కి జోడిగా ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ నటిస్తుంది. ఈ సినిమాకు హాట్ స్టార్ డిస్నీ ఏకంగా రూ.32 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా కేవలం ఓటీటీ కోసమే. మిగిలిన హక్కులు అలాగే ఉన్నాయి. అవన్నీ నిర్మాతలకు లాభమే. అన్ని కలుపుకుంటే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చేలా కనిపిస్తుంది.
ఇంత మంచి రేట్ వచ్చినపుడు థియేటర్స్ కోసం వేచి చూడటం కూడా వృథానే అని నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చేశారని.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పైగా సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్నా కూడా థర్డ్ వేవ్ మొదలైతే పరిస్థితులు ఎలా మారతాయో చెప్పడం కష్టం. అప్పుడు విడుదల చేస్తే కచ్చితంగా నష్టాలు తప్పవు. మరోవైపు అంధధూన్ సినిమా విడుదలై మూడేళ్లు అయిపోయింది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాను చూశారు. దాంతో థియేటర్లో విడుదల చేస్తే వైరస్ భయాన్ని తట్టుకొని ఎంతమంది వచ్చి చూస్తారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అన్నింటికీ మించి నితిన్ గత రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇది కూడా ఓటిటీ విడుదల వైపు అడుగులు వేయడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
‘ఆదిపురుష్’లో హనుమంతుడు ఇతడే..!
19 ఏళ్ల కెరీర్ లో నితిన్ వదిలేసిన సినిమాలివే..!
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Maestro
- nabha natesh
- nitin
- ott
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

