Janhvi Kapoor | శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో..!!

janhvi kapoor tollywood entry | జాన్వీ కపూర్‌ను చూస్తుంటే ఎవరికైనా ఒకటే మాట అనాలి అనిపిస్తుంది. నిజంగానే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మురిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ అని. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా ఆ మాత్రం అందం కచ్చితంగా ఉంటుంది. అతిలోక సుందరి కూతురు కావడంతో జాన్వీ కపూర్ కు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది.. ఇక్కడ ఒక్క సినిమా కూడా చేయకపోయినా తెలుగు ఇండస్ట్రీలో ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. చాలా రోజుల నుంచి కూడా ఈమెను తెలుగులో పరిచయం చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. శ్రీదేవి ఉన్నపుడు కూడా తన కూతురు తనలా సౌత్‌లో పేరు తెచ్చుకున్నపుడే ఆనందంగా ఉంటానని చెప్పింది. అయితే ఆమె చనిపోవడంతో అమ్మ కోరిక తీర్చలేకపోయింది జాన్వీ కపూర్. కానీ తప్పకుండా తాను కూడా సౌత్ సినిమాల్లో నటిస్తానని చాలా రోజుల నుంచి చెప్తుంది జాన్వీ కపూర్. కానీ సరైన కథ కావాలంటుంది.
జాన్వీ కపూర్ ఆ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు. ట్రిపుల్ ఆర్ సినిమాలోనూ జాన్వీ నటిస్తుందనే వార్తలొచ్చినా అది నిజం కాలేదు. కానీ ఇప్పుడు శ్రీదేవి కూతురు టాలీవుడ్ వైపు వస్తుందని ప్రచారం గట్టిగానే జరుగుతుంది. అయితే ఈమె వచ్చే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే చాలా ఏళ్లుగా జాన్వీని తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటికీ అది జరగలేదు. ఈ మధ్యే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ జాన్వీని టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఆయన దర్శకత్వంలో జాన్వీ నటించబోతుందనే ప్రచారం జరిగింది.
కృష్ణవంశీ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ఫామ్‌లో లేడు కానీ కచ్చితంగా సరైన సినిమా పడితే కృష్ణవంశీ సంచలనం సృష్టిస్తాడనడంలో సందేహం లేదు.
అలాంటిది కృష్ణవంశీ మొన్న లాక్ డౌన్ సమయంలో ఓ పవర్ పుల్ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేశాడని.. ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ సినిమా చూసిన తర్వాత తన కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించి అటు వైపు అడుగులు వేశాడని తెలుస్తుంది. బోనీ కపూర్‌తో కూడా కృష్ణవంశీకి మంచి పరిచయం ఉంది. బోనీ కపూర్‌కు కూడా కథ చెప్పడం.. సానుకూలంగానే స్పందించడంతో కృష్ణవంశీ ఆనందంగా ఉన్నాడు. అప్పట్లో బోనీ కపూర్ నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శక్తి: ది పవర్’ చిత్రం రూపొందించారు. ఇది అంతఃపురం సినిమాకు రీమేక్. ఇదిలా ఉంటే కృష్ణవంశీతో పాటు మరికొందరు దర్శకులు కూడా జాన్వీ కోసం ప్రయత్నిస్తున్నా.. ఈమె మాత్రం అస్సలు తెలుగు ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Janhvi Kapoor Tour | జాన్వీకపూర్ ఈ సారి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Janhvi Kappor : జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
janhvi kapoor | రెచ్చిపోయిన జాన్వీ.. పక్కనే ఉన్న వ్యక్తి ఎవరు?
janhvi kapoor | అమ్మ కల తీర్చలేదు!
జాన్వీని కిస్ అడిగిన నెటిజన్.. సమాధానం ఏంటి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

