అమ్మ కల తీర్చలేదు!

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు కొందరు తారలు. ఈ నానుడి పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉంది. అందాల తార, దివంగత శ్రీదేవి తనయ జాన్వీకపూర్ సైతం తన తల్లి కోరిక మేరకు డాక్టర్ కావాలనుకుందట. అయితే వైద్య విద్యను అభ్యసించే తెలివితేటలు తన వద్ద లేవని చెప్పడంతో కుటుంబ సభ్యులు సినిమాల్లోకి వెళ్లడానికి ఒప్పుకున్నారట. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది జాన్వీకపూర్. ‘అమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలని ఎన్నో కలలు కన్నది. నా కాలేజీ రోజుల్లో ఎప్పుడూ అదే విషయాన్ని ప్రస్తావించేది. సినీ వాతావరణంలో పెరగడం వల్ల నాకు చిన్నతనం నుంచే నటనపై ఆసక్తి కలిగింది. నాకున్న ప్రతిభ వైద్య వృత్తికి సరిపోదని తేల్చిచెప్పడంతో చివరకు సినిమాల్లోకి వెళ్లడానికి ఒప్పుకుంది. నేను డాక్టర్ కావాలనుకున్న అమ్మ కల తీర్చలేకపోయా’ అని చెప్పింది జాన్వీకపూర్. ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్లో అరంగేట్రం చేసిన జాన్వీకపూర్ అనతికాలంలోనే ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

