RRR: పునీత్ స్టైల్లో నాటు నాటు సాంగ్.. వైరల్‌గా మారిన వీడియో

రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ మ్యానియా దేశం మొత్తం వ్యాపించింది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన నాటు నాటు ఇటీవల ట్రెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 3 కోట్ల వీక్షణలకు చేరువైంది ఈ పాట. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మైండ్ బ్లోయింగ్ స్టెప్పులకు జనాలు ఫిదా అవుతున్నారు. ఈ పాటను పెద్ద తెరపై వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
‘నాటు నాటు’ పాటకు కీరవాణి స్వరాలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత కవర్ సాంగ్స్‌తో, ఎడిటర్స్ తమ అభిమాన కథానాయకుల పాత సాంగ్స్‌తో ‘నాటు’ను రీక్రియేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ డ్యాన్సులతో నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్ రూపొందించారు. ఈ వీడియోకి నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీం కూడా ఈ వీడియోకి స్పందించడం విశేషం.
#ಹಳ್ಳಿನಾಟು ft PowerStar⚡@PuneethRajkumar❤️#PuneethRajkumar #KingAPPU pic.twitter.com/lOHjtOtagV
— Pramod (@_PramodAppu1) November 21, 2021
ఆర్ఆర్ఆర్ కోసం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియా వైడ్‌గా ఎదురుచూస్తున్న ఈ సినిమా జనవరి 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

