నాగచైతన్యతో విడాకులకు ముందు సమంత చేసిందే ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసింది. దీంతో విడాకులు తీసుకోబోతున్నారా? అనే వార్తలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 2018లో అమెరికన్ సింగర్, కంపోజర్ నిక్ జోనస్‌ను ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంది. దాదాపు తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన నిక్‌ను ప్రియాంక పెళ్లి చేసుకుంటుందని తెలిసి అందరూ షాకయ్యారు.వీరి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో, హిందూ పద్ధతిలో జరిగింది.
పెళ్లి తర్వాత ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరుని ప్రియాంక జోనస్‌గా మార్చుకుంది. ఈ రెండేళ్ల పాటు ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ఇప్పుడు ఇద్దరు మధ్య గొడవలు వచ్చాయో, ఇతర కారణాలు ఏమైన ఉన్నాయో తెలియదు కానీ… ప్రియాంక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి జోనస్ అనే పేరుని తొలగించేసింది. అంతే కాదండోయ్ తన ఇన్‌స్టాలో ప్రతిదానికి మొదలంటూ ఒకటుంటుంది అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకుంది.
చైతూతో విడిపోవాలనుకున్న సమయంలో సమంత సోషల్ మీడియాలో తన పేరులో ఉండే అక్కినేని అనే పేరుని తొలగించి పాత పేరు సమంత రూతు ప్రభు అని పెట్టుకుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తుంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా తన భర్త పేరును తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తొలగించింది. దీంతో నిక్ నుంచి ప్రియాంక విడిపోనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రియాంక తల్లి మధు చోప్రా ఈ స్టార్ కపుల్ చాలా సంతోషంగా ఉన్నారని పుకార్లను కొట్టిపారేశారు. ప్రియాంక మరియు నిక్ ఇటీవల లాస్ ఏంజెల్స్‌లోని వారి మొదటి ఇంటికి మారారు మరియు వారు కలిసి దీపావళి జరుపుకున్నారని చెప్పారు.