chiranjeevi | చిరంజీవికి పేరు లేని సినిమా ఏదో తెలుసా..?

Mega star chiranjeevi | సాధారణంగా ఒక సినిమా మొదలైంది అంటే అందులో హీరో పేరు ఏంటి అని అడుగుతారు అభిమానులు. ఎందుకంటే తమ హీరో పేరు తెలుసుకోవాలని వారు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అలాంటిది కొన్ని సినిమాలలో హీరో పేరు అసలు పెట్టరు దర్శకులు. తాము కథ రాసుకునేటప్పుడు హీరో పేరు లేకుండా రాసుకుంటారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా కొన్ని తెలుగు సినిమాలలో ఇది జరిగింది. మనకు బాగా తెలిసిన స్టార్ హీరోలు కొన్ని సినిమాలలో పేరు లేకుండా నటించారు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కొన్ని సినిమాలలో మన హీరోలు నిజంగానే పేరు లేకుండా నటించారు. ఆ సినిమాలో ఒక్కరు కూడా హీరోలను పేరు పెట్టి పిలవరు.

ఉదాహరణకు అర్జున్ సినిమా తీసుకోండి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను గుణశేఖర్ తెరకెక్కించాడు. 2005లో విడుదలైన ఈ సినిమాకు యావరేజ్ కలెక్షన్స్ వచ్చాయి. సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన అర్జున్ ఒక వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఒక్కసారి కూడా మహేశ్ బాబును ఎవరు పేరు పెట్టి పిలవరు. సినిమా ఎండ్ కార్డ్స్ సమయంలో తన పేరు అర్జున్ అంటూ మహేశ్ బాబు రివీల్ చేస్తాడు. అప్పటివరకు ఎవరు అది గమనించరు కూడా. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలా ఒక సినిమాలో నటించాడు.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తెరకెక్కిన రాక్షసుడు సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు 35 ఏళ్ల కింద 28 సెంటర్లలో 100 రోజులు ఆడింది రాక్షసుడు. ఈ సినిమాలో కూడా చిరంజీవిని ఎవరు పేరు పెట్టి పిలవరు. నాగబాబు ఫ్రెండ్ అని పిలుస్తుంటారు. ఇక హీరోయిన్ రాధా పురుష అని పిలుస్తుంది. చివరి వరకు కూడా ఎవరు చిరంజీవిని పేరు పెట్టి పిలవడం జరగదు. అసలు ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు లేకుండానే చిరంజీవి నటించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కూడా హీరోలకు పేర్లు ఉండవు. చిన్నోడా పెద్దోడా మాత్రమే ఉంటాయి. ఇవన్నీ ఆయా సినిమాలు చూస్తున్న సమయంలో ప్రేక్షకులు పెద్దగా గమనించరు. తర్వాత వీటి గురించి ఇలా తెలుసుకున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Britney Spears: చిరంజీవి సినిమా కోసం బ్రిట్నీ స్పియర్ని రంగంలోకి దించుతున్నారా..!
చిరంజీవి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే.. సాయిపల్లవి క్లారిటీ..
మెగాస్టార్ చిరంజీవి డాన్సులను విమర్శించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?
మెగా ఫ్యామిలీ సీక్రెట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?
చిరంజీవి పాత టైటిల్స్ వాడుకున్న హీరోల లిస్ట్ ఇదే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

