మెగాస్టార్ చిరంజీవి డాన్సులను విమర్శించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..?

megastar chiranjeevi | ఏంటి.. వినడానికి విచిత్రంగా ఉంది.. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ కు పేరు పెట్టారా? ఆయన డ్యాన్సులను విమర్శించే వాళ్లున్నారా? అంతటి ధైర్యం ఎవరికి ఉందని అనుకుంటున్నారా? నమ్మడానికి కాస్త కష్టం అనిపించినా ఇది మాత్రం నిజం. ఈ రోజు మెగాస్టార్ ఈ రేంజ్లో డ్యాన్స్ చేయగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఒక వ్యక్తి. 66 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి వేసే స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే దానికి ఒక వ్యక్తి చేసిన విమర్శలే కారణం. ఆ రోజు ఆయన అలా అనకపోయి ఉంటే ఈ రోజు మెగాస్టార్ ఇంత బాగా స్టెప్పులు వేసి ఉండేవాడు కాదేమో! ఇంతకీ చిరంజీవి డ్యాన్స్‌కు పేరు పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఈ కథ తెలియాలంటే దాదాపు 38 ఏండ్ల వెనక్కి వెళ్లాలి.
మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి అప్పుడే కొత్తగా వచ్చిన రోజులు అవి. అప్పటికే కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఎన్టీఆర్, ఏయన్నార్‌లు ఇండస్ట్రీ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో చిరంజీవి కొత్త తరహాలో డ్యాన్సులు చేయడం మొదలు పెట్టాడు. పాటలు వస్తే థియేటర్ నుంచి బయటకి వెళ్లిపోయే ఆడియన్స్‌ను తన డ్యాన్సుల కోసమే థియేటర్లకు వచ్చేలా చేశాడు మెగాస్టార్. ఈ క్రమంలో తన ఐదో సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు ఒక పాటకు మెగాస్టార్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అవి చూసి సెట్లో ఉన్నవాళ్లందరూ చప్పట్లు కొట్టారు. ఆ సినిమాకు మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకన్న మాత్రమే చిరంజీవిని అదోలా చూస్తున్నాడు.
ఇది గమనించి చిరు.. వెంకన్న దగ్గరికి వెళ్లి తన డ్యాన్స్ ఎలా ఉందని ఫీడ్‌బ్యాక్ అడిగాడు. దానికి వెంకన్న బదులిస్తూ.. అందులో నీ గొప్పతనం ఏముంది.. నీ వెనకాల వాళ్లు ఎలా చేశారో నువ్వు అలాగే చేశావు కదా అని విమర్శించాడు. అది నిజమే కదా అని అనుకున్న చిరంజీవి.. ఆ విమర్శను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అప్పటి నుంచి డ్యాన్సుల్లో కొత్త మెళుకువలు నేర్చుకుని.. తన వెనకవాళ్లు చేసే దానికి, కొరియోగ్రాఫర్ చెప్పిన దానికంటే కంటే మరింత కొత్తగా యాడ్ చేసి డ్యాన్సులు చేసుకుంటూ వచ్చాడు చిరంజీవి. మొత్తానికి విమర్శను కేవలం నిరుత్సాహపరిచేదిగానే కాకుండా.. కొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవడానికి అని బలంగా నమ్మాడు. అందుకే ఈ రోజుకు కూడా స్క్రీన్‌పై తన డ్యాన్సులతో అదరగొడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Saidharam Tej | స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Prabhas | ప్రభాస్‌తో గొడవపడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లెహరాయి లిరికల్ సాంగ్ వచ్చేది అప్పుడే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

