Prabhas | ప్రభాస్‌తో గొడవపడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

Prabhas | ప్రభాస్‌ను అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తారు. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు కనెక్ట్ అయిన వాళ్లని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు ప్రభాస్. అందుకే ఒకసారి ఆయనతో సినిమా చేసిన తర్వాత అందరూ అతడికి స్నేహితులు అయిపోతారు. అలాంటి ప్రభాస్‌తో ఒక స్టార్ హీరోయిన్ గొడవ పడింది. ఏదో ఒకటి రెండు సార్లు కాదు.. సినిమా చిత్రీకరణ పూర్తయ్యేంత వరకు ఎన్నోసార్లు గొడవ పడింది. చివరకు చిరాకు వచ్చి ప్రభాస్ ఆమెతో మాట్లాడటమే మానేశాడు. యంగ్ రెబల్ స్టార్‌ను అంతలా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారు కదా..! ఆమె ఎవరో కాదు.. జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ ( kangana ranaut ).

దాదాపు 12 ఏళ్ల కింద పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్, కంగనా రనౌత్ కలిసి నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో తరచూ గొడవ పడేది కంగనా. కొన్ని రోజులు చూసిన ప్రభాస్ చివరికి ఆమెతో మాట్లాడడం మానేశాడు. ఈ విషయాన్ని స్వయంగా కంగనా రనౌత్ బయటపెట్టింది. తాజాగా ఈమె జయలలిత బయోపిక్ తలైవి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తను నటించిన ఏకైక తెలుగు సినిమా గురించి.. ఆ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి గుర్తు చేసుకుంది కంగనా.
కొన్ని కారణాల వల్ల అప్పట్లో ప్రభాస్‌తో తనకు మాటలు ఉండేవి కావని చెప్పింది. అయితే ఆ తర్వాత బాహుబలి లాంటి సినిమాలో ప్రభాస్‌ను చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించిందని.. ఆయనతో నటించడం తన అదృష్టం ఉంటుంది కంగనా. తనకు మరోసారి ప్రభాస్‌తో నటించే అవకాశం ఇవ్వాలి అంటూ పూరీ జగన్నాథ్‌ను ఈ మధ్య మీడియా ముఖంగా కోరింది ఈ హీరోయిన్. గొడవ పడిన విషయం చెప్పింది కానీ.. ఎందుకు పడాల్సి వచ్చిందో మాత్రం కారణాలు చెప్పలేదు కంగనా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Sai Dharam Tej: సాయి తేజ్‌పై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Sai dharam Tej: ప్రమాదం సమయంలో సాయి తేజ్ వాడిన బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

