Exercises | స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఏరోబిక్ వ్యాయామాలతో తగ్గుతున్న మరణ ప్రమాదం.. అధ్యయనంలో వెల్లడి..
బలమైన కండరాలు కేవలం శారీరక సామర్థ్యానికే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా కీలకమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (బలం పెంచే వ్యాయామాలు) గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Exercises | బలమైన కండరాలు కేవలం శారీరక సామర్థ్యానికే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా కీలకమని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రమం తప్పకుండా చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (బలం పెంచే వ్యాయామాలు) గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా వారానికి సరైన మోతాదులో చేసే ఈ వ్యాయామాలు జీవితకాలాన్ని పెంచే అవకాశమున్నట్లు అధ్యయనం వెల్లడించింది. దాదాపు 30 సంవత్సరాల పాటు సాగిన ఓ దీర్ఘకాలిక అధ్యయనం ప్రకారం, వారానికి 90 నుంచి 120 నిమిషాల పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసే వారిలో ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 13 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే గుండె సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 19 శాతం, నాడీ సంబంధిత వ్యాధుల వల్ల మరణించే ప్రమాదం 27 శాతం వరకు తగ్గినట్లు తేలింది.
రెండూ అవసరమే..
ఈ పరిశోధన ఫలితాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ఆరోగ్య నిపుణులపై నిర్వహించిన దీర్ఘకాలిక అధ్యయనాలతోపాటు మూడు వేర్వేరు పరిశోధన సమూహాల నుంచి సేకరించిన డేటాను విశ్లేషించారు. మొత్తం 1,47,374 మంది పాల్గొన్న ఈ అధ్యయనంలో 30 ఏళ్ల పరిశీలన కాలంలో 35,798 మంది మరణించినట్లు నమోదైంది. పాల్గొన్న వారిలో సుమారు మూడు వంతుల మంది వారానికి కనీసం 150 నిమిషాల మితమైన తీవ్రత కలిగిన ఏరోబిక్ వ్యాయామాలను కూడా చేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మాత్రమే కాకుండా, ఏరోబిక్ వ్యాయామాలు కూడా ఆరోగ్యానికి గణనీయమైన ప్రయోజనాలను అందిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. వారానికి 7.5 ఎంఈటీ గంటల కంటే ఎక్కువ స్థాయిలో ఏరోబిక్ శారీరక కార్యకలాపాలు చేసిన వారిలో మరణ ప్రమాదం 26 నుంచి 43 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అయితే అత్యంత తక్కువ మరణ ప్రమాదం స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తోపాటు అధిక స్థాయి ఏరోబిక్ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేసిన వారిలో కనిపించింది.
మితమైన స్థాయిలోనే చేయాలి..
వారానికి 30 నుంచి 44 ఎంఈటీ గంటల ఏరోబిక్ వ్యాయామంతోపాటు 60 నుంచి 119 నిమిషాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసిన వారిలో మొత్తం మరణ ప్రమాదం 45 శాతం వరకు తగ్గింది. ఇక వారానికి 45 ఎంఈటీ గంటలకంటే ఎక్కువ ఏరోబిక్ కార్యకలాపాలు చేసిన వారిలో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్థాయి ఏదైనా సరే, మరణ ప్రమాదం 53 నుంచి 58 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌ను వారానికి 120 నిమిషాల కంటే ఎక్కువగా చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి, మితమైన స్థాయిలో బలం పెంచే వ్యాయామాలను ఏరోబిక్ కార్యకలాపాలతో కలిపి చేయడం ఆరోగ్యకరమైన జీవనశైలికి సమర్థవంతమైన మార్గమని ఈ అధ్యయనం సూచిస్తోంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

