తిరుమల : వారణాసిలోని కాశీ మఠం సంస్థానం పీఠాధిపతి సంయమీంద్ర తీర్థ స్వామీజీ ( Samyamdindra Thirtha Swamiji ) బుధవారం తిరుమల( Tirumala ) శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు తిరుమల అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, గర్భాలయం వరకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 25 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 12 నుంచి 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 86,601 మంది భక్తులు దర్శించుకోగా 31,111 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.72 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు. 4.32 లక్షల లడ్డూలు విక్రయించామని తెలిపారు.