న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో సబ్సిడీ బియ్యం కొనుగోళ్లు, విక్రయాలలో మూడేండ్లలో రూ. 22 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ సబ్సిడీ బియ్యాన్ని సరఫరా చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం అస్సాంకు చెందిన కార్పొరేషన్ కలిసి హర్యానాలోని ఒక ప్రైవేట్ కంపెనీకి కిలో రూ.46కు విక్రయిస్తున్నాయని ఆరోపించారు. ఇది వారానికి సుమారు రూ.143 కోట్ల కుంభకోణానికి దారి తీస్తున్నదని పేర్కొన్నారు.