న్యూఢిల్లీ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదివారం ప్రజలకు కీలక సూచనలు చేసిం ది. ప్యాకేజ్ చేసిన ఆహారాన్ని తినేముందు దాని మీదుండే గడువు తేదీని, తయారు చేసిన తేదీలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పింది. హర్ లేబుల్ కుచ్ కెహతాహై అనే ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ ప్రకటన చేసింది. గడువు తేదీ ముగిస్తే ఆహారం రుచితో పాటు నాణ్యత కోల్పోతుందని.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని అధికారులు వివరించారు. ఇటీవల తమ సర్వేలో ఈ-కామర్స్ సంస్థల నుంచి ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఆర్డర్ చేయగా.. ఎక్కువగా గడువు తేదీ ముగిసినవే సరఫరా అవుతున్నట్టు తేలిందని.. అందుకే అప్రమత్తంగా ఉండాలన్నారు.