KCR | వరంగల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇటీవల అనారోగ్యంతో అకాలమరణం చెందిన ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓదార్చారు. అంతకుముందు పెద్ది ఇంటికి చేరుకోగానే ఒక్కసారిగా ఆయన పిల్లలను అకున చేర్చుకొని కేసీఆర్ కన్నీరు పెట్టారు.
పెద్ది కుటుంబసభ్యుల క్షేమం కోసం కేసీఆర్ హృదయం ఎంతగా తల్లడిల్లిందో నల్లబెల్లిలోని పెద్ది నివాసంలో ఆయన నిశ్శబ్దమే సంకేతాత్మకంగా నిలిచింది. పార్టీ ముఖ్య నేతలు అనునయించడంతో కేసీఆర్ కొంత తేరుకున్నారు. దాంతో అకడి వాతావరణం కాస్త తేలిక పడ్డట్టయ్యింది. అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ ఇటీవలే అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్.. పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి మధ్యాహ్నం చేరుకొన్నారు. ఈ సందర్భంగా ‘పెద్ది సుదర్శన్‌రెడ్డి అమర్హ్రే.. జోహార్ పెద్ది సుదర్శన్‌రెడ్డి’ అంటూ సాగిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల నినాదాల నడుమ పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి భార్య స్వప్న, కొడుకు నిదర్శన్‌రెడ్డి, కూతురు ధర్మిష్ట, తల్లి అమృతమ్మను కేసీఆర్ ఓదార్చారు. పెద్ది అన్నదమ్ములు, కుటుంబసభ్యులను పలుకరించి, పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ పెద్దగా వారికి ధైర్యం చెప్పారు. ‘సుదర్శన్‌రెడ్డి భౌతికంగా మన నడుమ లేడని ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందవద్దు. ధైర్యం చెడొద్దు. పెద్దదికుగా నేనున్నా’ అని వారందరికీ కేసీఆర్ భరోసా ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముందుగా ప్రకటించిన మేరకు పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు.. రూ.ఒక కోటి చొప్పున రూ.2 కోట్ల విలువైన చెక్కులను వారికి అందజేశారు. పెద్ది మాతృమూర్తి అమృతమ్మకు రూ.25 లక్షల చెకును కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్‌రెడ్డి అక సరోజనమ్మ, చెల్లెలు స్వాతి మాలకొండారెడ్డి, పెద్ది సోదరులైన రాయపరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, వారి పిల్లలు మహిపాల్‌రెడ్డి, గణేశ్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, శ్రీలత, అనిత, కిరణ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అన్విత, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట బీఆర్ఎస్ ముఖ్య నేతలైన పలువురు నల్లబెల్లికి వచ్చారు. వారిలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో విపక్షనేత మధుసూదనాచారి, శాసనమండలి వైస్‌చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, శంభీపూర్ రాజు, యాదవరెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి , కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్‌జాదవ్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీవన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, డీఎస్ రెడ్యానాయక్, మాజీ ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, బోయినపల్లి వినోద్‌కుమార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, గండ్ర వెంకటరమణారెడ్డి, డాక్టర్ రాజయ్య, దాస్యం వినయభాస్కర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్, సుంకె రవిశంకర్, శంకర్‌నాయక్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, వొడితెల సతీశ్, హరిప్రియానాయక్, భూపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, గండ్ర జ్యోతి, బడే నాగజ్యోతి, సుమిత్రానంద్ తనోబా, రజినీ సాయిచంద్ తదితరులు ఉన్నారు.
ఆందోళన చెందవద్దని, పార్టీ అండగా ఉంటుందని పెద్ది కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మకు కేసీఆర్ ధైర్యవచనాలు చెప్పారు. భార్య స్వప్నకు గుండెధైర్యాన్నిచ్చారు. పిల్లలను బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. వారికి తండ్రిలేని లోటు లేకుండా చూసుకోవాలని, పిల్లలను కాపాడుకోవాలని పెద్ది సోదరులకు కేసీఆర్ సూచించారు. పార్టీ స్థాపించిన నాటినుంచీ వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో, పార్టీ నిర్మాణంలో సుదర్శన్‌రెడ్డి పోషించిన పాత్రను, ఆత్మీయుడుగా తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ బాధాతప్త హృదయంతో గుర్తుచేసుకొన్నారు.

కేసీఆర్ నా ఆయుష్షు పోసుకొని కేసీఆర్ నిండునూరేండ్లు బతుకాలె. కన్న కొడుకోలే మాకు ఆపదప్పుడు కేసీఆర్ తోడు నిలిచిండు. నా ఆయుష్షు కూడా పోసుకుని మాలాంటి ఎందరికో ఆయన అండగా నిలువాలె’ అని దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మాతృమూర్తి పెద్ది అమృతమ్మ కోరుకున్నారు. కేసీఆర్ పరామర్శించిన అనంతరం ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. కోట్లాది మంది ప్రజల అభిమానం నా కొడుకు పెద్ది పొందుతాడని కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. ‘ఉప్పిడి ఉపాసం ఉండి నా కొడుకు రాజకీయాల్లో పని చేసేటోడు. కొడుకు ఎదిగాక ఒక్కనాడూ నా చేత బువ్వ ఎరుగడాయే.. ఎప్పుడూ ప్రజల కోసమే ఆరాటపడిండు’ అని తెలిపారు. తెలంగాణ వత్తే అందరి బతుకులు మారుతాయని అనేటోడని చెప్పారు. తెలంగాణ కోసం కొడుకు పోలీసులతో దెబ్బలు తిన్నడు, అయినా నిత్యం ప్రజల కోసమే ఆరాట పడేటోడని తెలిపారు. కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదం పొందిన కొడుకును భగవంతుడు ఓర్వకపాయె..అని ఆవేదన వ్యక్తంచేశారు.

నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం విషణ్ణవదనంలో కూర్చున్న కేసీఆర్. చిత్రంలో పెద్ది సతీమణి, తల్లి, పిల్లలు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వరుసగా వద్దిరాజు రవిచంద్ర, మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కే సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, వినోద్‌కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, రాజయ్య, సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, శంకర్‌నాయక్, గండ్ర జ్యోతి తదితరులు