ఇటీవల విడుదలైన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు విశాల్ చతుర్వేది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 300కోట్లకు పైగా వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నది.
ఈ నేపథ్యంలో దర్శకుడు విశాల్ చతుర్వేది కొత్త చిత్రాన్ని ప్రకటించారు.. మహాకవి గోస్వామి తులసీదాస్ జీవిత కథతో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. దీనికి ‘రాంబోలా- ది ఇమ్మోర్టల్ స్టోరీ ఆఫ్ గోస్వామి తులసీదాస్’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. తులసీదాస్ జీవిత ప్రయాణం, సాహిత్య సేవ, సమాజంపై ఆయన ప్రభావం వంటి అంశాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.